Home జాతీయ వార్తలు కాపు నేతలతో చర్చించండి : పవన్ కళ్యాణ్

కాపు నేతలతో చర్చించండి : పవన్ కళ్యాణ్

pawankalayanహైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో కాపు రిజర్వేషన్ ఉద్యమం తారాస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. కాగా నేడు జనసేన అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ ఈ అంశం పై మరోసారి స్పందించారు. కాపులను బిసిల్లో చేర్చడం అంశం పై కాపు నేతలతో ఎపి ప్రభుత్వం నేరుగా చర్చలు జరపాలని పవన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. సమస్యల జఠిలం కాకముందే పరిష్కారం జరపాలని ఆయన హితవు పలికారు. ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం కాపులను బిసిల్లో చేర్చుతామని ఇచ్చిన హామీని పవన్ గుర్తు చేశారు. సమస్యను సత్వరంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం మేధావులతో కూడిన బృందాన్ని నియమించాలని పవన్ విజ్ఞప్తి చేశారు.