Home జాతీయ వార్తలు బెంగాల్‌లో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదు

బెంగాల్‌లో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదు

సిపిఐ జాతీయ కార్యదర్శి అమర్‌జిత్ కౌర్

ammar-jeet-kaurపాట్నా: పశ్చిమబెంగాల్‌లో జరుగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌తో వామపక్షాల పొత్తు ఉండదని సిపిఐ తెలిపిం ది. రాష్ట్రంలో అలాంటి పొత్తుకు తావు ఉండదని సిపిఐ జాతీయ కార్యదర్శి అమర్‌జిత్ కౌర్ స్పష్టం చేశారు. ఇప్పటివరకైతే కాంగ్రెస్ పార్టీతో మేం ఎలాంటి కూటమి ఏర్పడలేదు. అయితే భవిష్యత్తులో కూడా నేరుగా కూట మి ఏర్పాటుకు తావు లేదని చెప్పారు. ఆదివారం ఆమె ఇక్కడ విలేకరులతో మాట్లాడారు.మమతా బెనర్జీ ప్రభు త్వాన్ని తొలగిస్తామని చెప్పుకునే అన్ని పార్టీలు ఇంతకు వారు ఏ పక్షం వైపు ఉంటారనేది స్పష్టం చేయడం లేద న్నారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి), వామపక్షాల మధ్య ముఖాముఖి పోరు జరుగనుందన్నారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, ఆమె పాల నపై ప్రజల్లో వ్యతిరేకత చోటు చేసుకుందని తెలిపారు. త్వరలో జరుగనున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మమ తాబెనర్జీ ప్రభుత్వానికి చరమగీతం పాడనున్నారని కౌర్ చెప్పారు. కేరళలో కూడా వామపక్షాలు, కాంగ్రెస్ నేతృ త్వంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ మధ్యనే ప్రత్య క్ష పోరు జరుగనుందని తెలిపారు. పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్‌తో పొత్తు ప్రసక్తే లేదని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు అమర్‌జిత్‌కౌర్ సమాధానం ఇచ్చారు.
కన్హయ్య రక్షణపై ఆందోళన
జెఎన్‌యు విదార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ రక్షణపై సిపిఐ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కన్హయ్య ను కాల్చివేస్తే, నాలుక కోస్తే నగదు రివార్డులు అందజే స్తామని కొన్ని శక్తులు పేట్రేగిపోవడం ఆక్షేపణీయమని అమర్‌జిత్‌కౌర్ అన్నారు.జెఎన్‌యు క్యాంపస్‌లో సురక్షి తంగానే ఉన్నా,క్యాంపస్ బయటనుంచి ఆయనకు బెది రింపులు రావడం శోచనీయమనారు. సిపిఐ సభ్యుడు కూడా అయిన కన్హయ్య ‘భారతదేశ ప్రజాస్వామ్య రక్షణ కు ప్రతీక’గా నిలిచారన్నారు. జెఎన్‌యులో జరిగిన సంఘటనపై నిజాలు బయట పెట్టేందుకు దర్యాప్తునకు ఆదేశించాలని అమర్‌జిత్‌కౌర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నరేంద్రమోడీ ప్రభుత్వం సమాజాన్ని విభజిం చేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. ధరల నిరవధిక పెరుగుదలకు కళ్లెం వేయడంలో, ఉద్యోగావకాశాలను కల్పించడంలో, నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడంలో ఘోరవైఫల్యం చెందిన నరేంద్రమోడీ ఓటుబ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారని కౌర్ మండిపడ్డారు.