Search
Sunday 23 September 2018
  • :
  • :

తమపై దాడులు ఆపండి: ఆఫ్రికా విద్యార్థులు

attackఢిల్లీ: తమపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఆఫ్రికా విద్యార్థులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టారు. తమపై దాడులపట్ల భారత్ ప్రభుత్వం వెంటనే స్పందించాలని నల్లజాతీయులు డిమాండ్ చేస్తున్నారు. ఆఫ్రికా విద్యార్థులపై భారత్‌లో ఎక్కువగా దాడులు జరుగుతున్నాయని వారు ఆందోళన నిర్వహిస్తున్నారు. మే 20న ఓ కాంగో విద్యార్థిని ముగ్గురు వ్యక్తులు కొట్టి చంపారు. హైదరాబాద్‌లో కూడా ఆఫ్రికా విద్యార్థిపై దాడి చేశారు. వరుస ఘటనల నేపథ్యంలో ఆఫ్రికా విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఆఫ్రికా విద్యార్థులకు పూర్తి భద్రత కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా ఈ అంశంపై వ్యక్తిగతంగా సమీక్షిస్తున్నారు.

Comments

comments