Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

పుకార్లను నమ్మొద్దు : డిజిపి

Do not Believe the Rumors : DGP

హైదరాబాద్ : తెలంగాణలో దోపిడీ దొంగలు, కిడ్నాపర్లు సంచరిస్తున్నారంటూ వస్తున్న పుకార్లను ప్రజలు నమ్మొద్దని డిజిపి ముదిరెడ్డి మహేందర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కిడ్నాపర్లు, దోపిడీ దొంగలు తిరగడం లేదని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మొద్దని ఆయన సూచించారు. పుకార్లను వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అనుమానితులు తారసపడినప్పుడు 100కి ఫోన్ చేయాలని ఆయన చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నిజం కావని, తప్పుడు సమాచారాన్ని వాట్సాప్‌లో పంపిన వారిపై సైతం చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే వారిపై కూడా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. తెలంగాణ వ్యాప్తంగా ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను బలోపేతం చేస్తున్నామని ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా సిసిటివి వ్యవస్థ పటిష్టంగా ఉందని ఆయన పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రజలు పోలీసులతో విధిగా సహకరించాలని ఆయన కోరారు.

Do not Believe the Rumors : DGP

Comments

comments