Home జాతీయ వార్తలు రాజకీయాల్లోకి రాను : బ్రాహ్మణి

రాజకీయాల్లోకి రాను : బ్రాహ్మణి

Nara-Brahmani

హైదరాబాద్ : తాను రాజకీయాల్లోకి రానని మంత్రి నారా లోకేష్ సతీమణి, హెరిటేజ్ ఎండి నారా బ్రాహ్మణి స్పష్టం చేశారు. శనివారం జరిగిన ఫిక్కీ సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆమె చెప్పారు. హెరిటేజ్‌ను అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని ఆమె పేర్కొన్నారు. రైతులకు ఆర్థిక పరిపుష్ఠి సమకూర్చడం, తద్వారా ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందించేందుకు కృషి చేస్తానని ఆమె తెలిపారు.

Do not come into Politics :  Brahmani