Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

గత పాలనలో అభివృద్ధ్దికి నోచుకోని తెలంగాణ

Vinod1

బెల్లంపల్లి: ఆంధ్రా పాలనలో తెలం గాణ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు వివేక్ అన్నారు. గురు వారం బెల్లంపల్లి పట్టణంలోని పద్మశాలి భవన్‌లో ఏర్పా టు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతానికి అన్ని విధా లుగా అన్యాయం జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఎన్నో పోరా టాలు చేశారని అప్పుడు తండ్రిగారైన వెంకటస్వామి కూడా తెలంగాణ కోసం కెసిఆర్‌తో కలిసి పోరాటాలు చేశారని పేర్కొన్నారు.

తాను ఎంపిగా ఉన్నప్పుడు పార్ల మెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని నినాదాలు చేస్తే తెలంగాణ ప్రాంత ఎంపీలను సస్పెండ్ చేశారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంతో ప్రతిష్టాత్మ కంగా ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకం సక్సెస్‌ఫుల్ గా కొనసాగుతుందని అన్నారు. 1850 కోట్ల నిధులతో 29 మండలాలలో మిషన్ భగీరథ పనులు చురుకుగా సాగుతున్నాయని అన్నారు. త్వరలో పదవి పూర్తి అయి తే ఇంటింటికి  నల్ల నీరు అందుతాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో  ఇస్తున్న  9 గంటల నిరంతర విద్యుత్ సరఫరా ఏ రాష్ట్రంలో ఇవ్వడం లేదని ఆయన పేర్కొన్నారు. బెల్లంపల్లి ప్రాంతంలో నివాసం ఉంటున్న వారికి పట్టాలు ఇవ్వాలనే విషయం ఎమ్మెల్యే చిన్నయ్య తన దృష్టికి తీసుక వచ్చారని పట్టాలు వచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు.

అదే విధంగా బెల్లంపల్లికి వంద పడకల ఆసుపత్రి మంజూరు అయ్యేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంతకు ముందు బెల్లంపల్లి రైల్వేస్టేషన్ నుండి బైక్ ర్యాలీతో బజార్ ఏరియా మీదుగా వెళ్ళారు. అనంతరం ఎఎంసి సమీపంలో గల వివేకానందున్ని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడే స్వర్గీయ వెంకటస్వామి విగ్రహా ప్రతిష్టాత్మ కోసం భూమి పూజ చేశారు. అలాగే పాతబస్టాండ్ సమీపంలో గల తెల ంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం పద్మశాలి భవన్‌లో వివేక్‌ను టిబిజికెఎస్ అధ్యక్షులు వెంకట్రావ్, బెల్లంపల్లి ఎమ్మె ల్యే దుర్గం చిన్నయ్యతో పాటు టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో టిబిజికెఎస్ అధ్యక్షులు వెంకట్రావ్, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, ము న్సిపల్ చైర్‌పర్సన్ మహేష్ సునీతారాణి, వైస్ చైర్మన్ సత్యనారాయణ, టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు నర్సింగం,ప్రవీణ్,బొడ్డు నారాయణ, ముని మంద రమేష్, సత్యనారాయణతోపాటు ఆయా ప్రాంతాలకు చెందిన జెడ్పిటిసిలు,ఎంపిపిలు,ఎంపిటిసిలు,సర్పంచ్‌లు, కౌన్సిలర్లతో పాటు టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

comments