Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

వైద్యులు లేని ప్రభుత్వాసుపత్రి

Do not have doctors  in Government hospital
గుండాల: మండల కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో గత రెండు వారాలుగా వైద్యాధికారులు లేక పోవడంతో ఇక్కడి నిరుపేద గిరిజన రోగులు, గర్భిణి స్త్రీలు నాన అవస్తలకు గురౌతున్న సంఘటన ఇక్కడ నెలకొంది. మారుమూల ఏజెన్సి గుండాలలో ప్రభుత్వాసుపత్రిలో రెగ్యులర్‌గా పని చేస్తున్న వైద్యున్ని ఇల్లందు పట్టనానికి రెండు వారాల క్రితం బదిలి చేసిన జిల్లా వైద్యాధికారులు ఆయన స్థానంలో వైద్యులను నియమించక పోవడంతో ఇక్కడి నిరుపేద రోగులు వైద్యం అందక తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సిన దుస్థితి. క్రింది స్థాయి సిబ్బంది వారికి తెలిసిన ప్రాథమిక వైద్యాన్ని అందిస్తున్నారు. గతంలో ఇద్దరు వైద్యులు విధులను నిర్వహిస్తుండటంతో రోగులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రతిరోజు వందల సంఖ్యలో రోగులకు వైద్యం అందించడంతో ప్రభుత్వాసుపత్రిపై ఇక్కడి రోగులకు మంచి అభిప్రాయం ఏర్పడింది. గర్భిణీలు ప్రతిరోజు అమ్మవడి వాహనం ద్వార వైద్య కేంద్రానికి వచ్చి వైద్య చికిత్స పొందుతున్నారు. 15 రోజులుగా వైద్యులు లేకపోవడంతో తిరిగి వెళ్ళిపోతున్నారు. వైద్య కేంద్రంలో మందుల కొరత తీవ్రంగా ఉన్నట్టు సిబ్బంది తెలుపుతున్నారు. రోగుల సౌకర్యార్థం వైద్యకేంద్రంలో ఏసి ఏర్పాటుకోసం గత ఎనిమిది నెలలుగా పనులు పూర్తి కాక పోవడంతో రోగులు తీవ్ర అసౌకర్యానికి గురౌతున్నారు. ఆసుపత్రిలో వైద్యునితో పాటు, మందుల కొరత, అసౌకర్యాలపై జిల్లా వైద్యాధికారికి వివరణ కోరేందుకు ఫోన్ ద్వారా ప్రయత్నించగా వారు స్పందించక పోవడం విచారకరం.

Comments

comments