Home కరీంనగర్ పిహెచ్‌సిలో ప్రసవాలు పెంచని డాక్టర్లపై చర్యలు

పిహెచ్‌సిలో ప్రసవాలు పెంచని డాక్టర్లపై చర్యలు

జిల్లా కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ హెచ్చరిక

Collector3

కరీంనగర్ ప్రతినిధి : జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో నిర్ణయించిన లక్షం మేరకు ప్రసవాలు నిర్వహించని డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాధారణ పిహెచ్‌సిలలో నెలకు 5, 24 గంటల పిహెచ్‌సిలలో నెలకు 10, కమ్యూనిటి హెల్త్ సెంటర్లలో నెలకు 30, సివిల్ ఆస్పత్రులలో నెలకు 300 చొప్పున ప్రసవాలు నిర్వహించాలని ఆదేశించారు.

పిహెచ్‌సిలలో 1-2 ప్రసవాలు నిర్వహిస్తే ఇకపై సహించేది లేదని, లక్షం మేరకు ప్రసవాలు చేయని వారిపై చర్యలు తప్పవని అన్నారు. పిహెచ్‌సిలకు అన్ని వసతులు కల్పించామని అన్నారు. వెంటనే అన్ని పిహెచ్‌సిలలో ఆస్పత్రి అభివృద్ధి సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. జనవరి లో పిహెచ్‌సిలలో గల పాత సామాన్లన్నింటి రద్దు చేసి తీసివేయాలని ఆదేశించారు. వెంటనే పిహెచ్‌సిలలో ఉన్న పాత సామాగ్రి జాబితా తయారు చేసి చర్యలు తీసుకోవాలని సూచించారు. సబ్ సెంటర్లను దగ్గరలోని పిహెచ్‌సిలకు అనుసందానం చేయాలని, ప్రస్తుతం జిల్లాల పునర్విభజన అనంతరం పరుపులు సరిగా లేవని అన్నారు. గ్రామాలోని పేద ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలందిస్తూ ప్రజల మన్ననలను పొందాలని అన్నారు.