Home బిజినెస్ నోట్లు నిల్వ చేయొద్దు: ఆర్‌బిఐ

నోట్లు నిల్వ చేయొద్దు: ఆర్‌బిఐ

RBI

ముంబయి: నోట్ల సరఫరా కావలసినంత ఉందని, వాటిని నిల్వ చేయొద్దని భారత రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బిఐ) గురు వారం ప్రజలకు తెలిపింది. బ్యాంకులు రద్దీని తట్టుకునేం దుకు శ్రమిస్తున్నప్పటికీ పాత రూ.500, 1000 నోట్లను మార్చుకునేందుకు ప్రజలు ఇప్పటికీ భారీ సంఖ్యలో బ్యాంకులకు వస్తూనే ఉన్నారు. నాట్లు వేసే కాలం, పెళ్ళిల సీజన్ అయినందున డబ్బును విత్‌డ్రా చేసుకునే ఆంక్షల ను రైతులకు, మధ్యతరగతి కుటుంబాల కోసం ప్రభుత్వం కొంతమేరకు సడలించింది. అదే సమయంలో కరెన్సీ మార్పిడి(ఎక్స్‌ఛేంజ్) పరిమితిని సగానికి తగ్గించి రూ. 2000కు కుదించింది.

రెండు నెలల క్రిందట ఆరం భించిన కరెన్సీ ముద్రణ ఉత్పత్తిని పెంచినట్లు, నోట్ల సర ఫరా తగి నంత ఉందని ఆర్‌బిఐ తన ప్రకటనలో మరోసారి స్పష్టం చేసింది. రూ. 500 నోట్లు ఇచ్చేలా ఎటిఎంల సామ ర్థాన్ని పెంచినప్పటికీ భారీ సంఖ్యలో ప్రజలు విత్‌డ్రాలు చేస్తుం డడం వల్ల అవి త్వరగా ఖాళీ అయిపోతున్నాయి. మెట్రో నగరాలలో బుధవారం నుంచి పాత కరెన్సీ మార్చు కునే వారి వేలి మీద తుడిచేయలేని సిరా గుర్తు వేస్తుండడం తో కొన్ని బ్యాంకు శాఖల్లో క్యూ స్వల్పంగా తగ్గింది. ఇది వరకే పాత కరెన్సీ మార్చుకున్న వెంటనే మరోసారి మార్చుకోకుం డా ఉండేందుకే ఈ సిరా గుర్తును వేస్తున్నారు. రూ. 500, 1000 నోట్లను నవంబర్ 8న రద్దు చేస్తున్నట్లు ప్రకటన వెలువడినప్పటి నుంచి బ్యాంకులకు, పోస్టాఫీసులకు భారీ సంఖ్యలో ప్రజలు పోటెత్తడం, పాత నోట్లు మార్చుకోడానికి చాంతాడంత క్యూలో గంటల నిలుచోడం జరుగుతోంది.

రూ. 2.5 లక్షల డిపాజిట్లకు ‘పాన్’ తప్పనిసరి : సిబిడిటి

pan-card

న్యూఢిల్లీ: పాత పెద్ద నోట్లు రూ. 500, రూ.1000 రద్దు తర్వాత బ్యాంకు ఖాతాల్లో రూ.2.5 లక్షలకు పైగా జమా చేయాలంటే పర్మనెంట్ అకౌంట్ నెంబర్(పాన్) తప్పని సరి కోట్ చేయాల్సి ఉంటుందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్(సిబిడిటి) గురువారం తెలిపింది. సహకార బ్యాంకుల్లో లేక షెడ్యూల్డ్ బ్యాంకుల్లో ఒకే రోజున రూ. 50,000కు పైగా జమా చేస్తే పాన్ తెలుపడం తప్పనిసరి అని పేర్కొంది. అక్రమంగా ఆర్జించిన డబ్బు, నల్లధనం నివారణకే ఇలా పాన్ కోట్ చేయడం తప్పనిసరి చేసినట్లు వెల్లడించింది.

సిబిడిటి సవరణ మేరకు 2016 నవంబర్ 9 నుంచి డిసెంబర్ 30 వరకు ఖాతాలో రూ. 2.5 లక్షలకు మించి జమాచేస్తే కూడా పాన్ తప్పక తెలుపాల్సి ఉంటుంది. ఇప్పుడున్న అంశాలకు ఇది అదనం అని కూడా సిబిడిటి తెలిపింది. సిబిడిటి ఇప్పటికే 25 కోట్ల పాన్ కార్డులను జారీ చేసింది. పాన్ కార్డు కావలసి నవారు నిర్ణీత ఫారమ్‌ను నింపి ఎన్‌ఎస్‌డిఎల్ నుంచి పొందవచ్చని పేర్కొంది. ఇటీవల పొదుపు ఖాతాలో రూ. 2.5 లక్షలు, కరెంట్ ఖాతాలో రూ. 12.50 లక్షలు దాటి జమా అయితే ఆ వివరాలను ఆదాయపు పన్ను శాఖకు తెలుపాల్సిందిగా ప్రభుత్వం బ్యాంకులకు, పోస్టాఫీసుల కు ఆదేశించింది.

22,500 ఎటిఎంల్లో కొత్త నోట్లు

పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు నానా ఇక్కట్లు పడుతు న్నారు. ఈ నేపథ్యంలో దేశంలో ఉన్న దాదాపు 2 లక్షల ఎటిఎంల్లో ఇప్పటి వరకూ కొత్త నోట్లు రాలేదు. అయితే కొత్త నోట్ల కోసం సాఫ్ట్‌వేర్ మార్పు చేసిన 22,500 ఎటిఎంలు అందు బాటులోకి తెచ్చా మని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు.

రూ.1000 నోట్లు పునరు ద్ధరించే ఆలోచన ఇప్పట్లో లేదని స్పష్టం చేశారు. పెళ్ళి ళ్ళకు రూ. 2.5 లక్షల వరకు విత్‌డ్రా చేసుకునే అవకా శాన్ని కల్పించడంతో సామాన్యులకు ఊరట కలిగిం దన్నారు. పాత నోట్ల మార్పిడి దుర్విని యోగాన్ని అరికట్టేందుకు పరిమితిని తగ్గించినట్లు కూడా జైట్లీ తెలిపారు.