Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

టైమ్ పాస్ చేయట్లేదు.. టీమిండియా కోచ్ రవిశాస్త్రి

Ravisastri-2

ముంబయి: రవిశాస్త్రి కోచ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమిండియాలో క్రమశిక్షణ గాడి తప్పిందని వస్తున్న విమర్శలను భారత జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి కొట్టి పారేశాడు. కుంబ్లే కోచ్‌గా ఉన్నప్పుడూ జట్టులో క్రమశిక్షణ ఎక్కువగా కనిపించేదని, ఇప్పుడూ దాని జాడ కనిపించడం లేదని ఇటీవల వార్తలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో శాస్త్రి స్పందించాడు. జట్టును విజయపథంలో నడిపించడమే తన ముందున్న ప్రధాన లక్షమన్నాడు. తనతో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా విజయానికి అత్యం త ప్రాధాన్యత ఇస్తాడన్నాడు.

ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వా సం కోల్పోకుండా జట్టును గెలుపు బాటలో నడిపించేందుకు శాయశక్తుల కృషి చేస్తాడని స్పష్టం చేశాడు. కాగా, ఇటీవల శ్రీలంకతో సొంతగడ్డపై రెండు టెస్టులు డ్రా కావడం, తొలి వన్డేలో జట్టు ఘోర పరాజయం చవిచూడడం వంటి పరిణామాలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నాడు. తొలి వన్డేలో పిచ్ వల్లే ఓటమి పాలయ్యామని, ఇక ఈడెన్ గార్డెన్, ఢిల్లీలలో ప్రతికూల వాతావరణం వల్ల తమ విజయవకాశాలకు గండి పడిందన్నాడు. అంతేగాని తమ జట్టు బలహీనపడిందని భావించడం సముచితం కాదన్నాడు.

రానున్న దక్షిణాఫ్రికా సిరీస్ తమకు సవాలు వంటిదేనన్నాడు. ఇందులో గెలిచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తామన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ వి భాగాల్లో భారత్ చాలా బలంగా ఉందన్నాడు. సౌ తాఫ్రికాను ఓడించే సత్తా తమ జట్టుకు ఉందన్నాడు. గతంకంటే భిన్నంగా ఈసారి ఫలితాలు ఉంటాయనే నమ్మకాన్ని శాస్త్రి వ్యక్తం చేశాడు. తనపై, కెప్టెన్ కోహ్లిపై కొందరు కావాలనే వి మర్శలు చేస్తున్నారన్నాడు. ఇది మంచి సం ప్రదాయం కాదన్నాడు. కోహ్లి కెప్టెన్‌గానే కాక ఆటగాడిగా కూడా నిలకడైన ప్ర దర్శన ఇస్తున్నాడని, అతనిపై విమర్శలు చేయడం తగదని స్పష్టం చే శాడు. చవకబారు పద్ధతులకు వి మర్శకులు స్వస్తిపలికి తే బాగుంటుందని హితవు పలికాడు.

Comments

comments