Search
Wednesday 26 September 2018
  • :
  • :

మా సార్ ను బదిలీ చేయొద్దు

Do not transfer our server

మా హెచ్‌ఎంను బదిలీ చేయవద్దని కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగిన విద్యార్థులు
డిఆర్‌ఒ మధుసూదన్‌నాయక్‌కు వినతిపత్రం అంజేసిన విద్యార్థులు
కర్నాటకను తలపింపజేసిన విద్యార్థులు

మన తెలంగాణ/నాగర్‌కర్నూల్ టౌన్ : జిల్లా కేంద్రంలోని జడ్‌పి ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్న రమేష్‌ను బదిలీ చేయవద్దంటూ సోమవారం కలెక్టరేట్ ఎదుట పాఠశాల విద్యార్థులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. హెచ్‌ఎంగా పాఠశాలకు వచ్చిన రోజు విద్యార్థుల సంఖ్య 250గా ఉండేదని, ఆయన కృషి వల్ల ప్రస్తుతం ఆ సంఖ్య 1200 చేరిందని తెలిపారు. పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడిగా విద్యార్థులకు బోధన తదితర అంశాలలో కనపరిచిన సేవలు ఎనలేనివని విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. పదవ తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించి పాఠశాలకు వన్నె తెచ్చారని వారు అన్నారు. పలువురి సహాయంతో తరగతుల గదులను నిర్మించారన్నారు. విద్యార్థులు ఉత్తీర్ణతకు కృషి చేసి రాష్ట్రంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారని విద్యార్థులు తెలిపారు. డిజిటల్ తరగతులు, ల్యాబ్‌లు తదితర సదుపాయాలను కల్పించారని, అలాంటి ఉపాధ్యాయుడు తమ పాఠశాల నుంచి తరలి వెళితే మేమూ ఈ పాఠశాల నుంచి వేరే పాఠశాలకు మారుతామని విద్యార్థులు డిఆర్‌ఒకు వినతిపత్రం అందజేశారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే మర్రి జన్ధాన్‌రెడ్డికి కూడా విన్నవించుకున్నారు. మా భవిష్యత్ బాగుపడాలంటే మా హెచ్‌ఎంను బదిలీ చేయవద్దని వేయి మందికి పైగా విద్యార్థులు డిఆర్‌ఒను వేడుకున్నారు.

Comments

comments