Search
Sunday 23 September 2018
  • :
  • :

అభివృద్ధి పనులను చూసి టిఆర్‌ఎస్‌లో చేరా

do-the-development-work-and-join-the-trs

నియోజకవర్గ ప్రజల కోసం నా ప్రాణం ఉన్నంత వరకు సేవ చేస్తా
మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి

మన తెలంగాణ/కల్వకుర్తి : సిఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి పార్టీలో చేరుతున్నానని మాజీ ఎమ్మెల్యే ఎడ్మకిష్టారెడ్డి తెలిపారు. నియోజకవర్గ ప్రజల కో సం కోసం తన ప్రాణం ఉన్నంత వరకు వారికి సేవ చేస్తానని రైతు బిడ్డ మాజీ ఎమ్మెల్యే ఎడ్మకిష్టారెడ్డి అన్నారు. శనివారం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో చేరడానికి సాయంత్రం 3గంటలకు కల్వకుర్తి పట్టణం నుండి 230 వాహనాలలో దాదాపు 3000వేల మందితో పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఎడ్మ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ప్రజా సంక్షేమంతోపాటు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతూ అన్ని వర్గాల ప్రజలకు అందజేస్తున్న సీఎం కేసీఆర్ అని వారు అన్నారు. రైతుబంధు పథకం ద్వారా నేను ఒక రైతు బిడ్డగా ఎంతో సంతృప్తి చెందానని అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ పటిష్టత కోసం అహర్నిశలు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన వివరించారు.

Comments

comments