Home అభిప్రాయ సేకరణ అమ్మాయిలు పక్కలోకే పనికొస్తారని నటుడు చలపతిరావు చేసిన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా?

అమ్మాయిలు పక్కలోకే పనికొస్తారని నటుడు చలపతిరావు చేసిన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా?

chalapathi

‘రారండోయ్ వేడుక చూద్దాం’ తెలుగు చిత్రం ఆడియో రిలీజింగ్ ఫంక్షన్ కు విచ్చేసిన సీనియర్ నటుడు చలపతిరావుకు యాంకర్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ‘ అమ్మాయిలు హానికరం కాదు కానీ.. పక్కలోకి పనికొస్తారు’అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారంలేపుతున్నాయి. దీంతో సినీ ప్రముఖులు, మహిళా సంఘాల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు చలపతిరావుపై పోలీసు కేసు నమోదైంది.

చివరకు మహిళల పట్ల తాను చేసిన వ్యాఖ్యలకు చలపతిరావు క్షమాపణ చెప్పారు. కానీ, కేసులు ఎదుర్కొడానికీ సిద్ధమేనని ఆయన వ్యాఖ్యలు చేయడంతో తనకు తాను సమర్థించుకుంటున్నట్లు స్పష్టమవుతోంది.

ఈ విషయమై మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. అవును, కాదు. చెప్పలేంతోపాటు మీ స్పష్టమైన విమర్శలు, అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.

( వీడియో Ntv సౌజన్యంతో)

Do you support the words of actor Chalapathi Rao that the girls are useful for bed side only?