Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

మీరు విండోస్ 7 యూజ్ చేస్తున్నారా…? ఇక మీ పని అయిపోయినట్టే…!!

microsoft windows 7 operating system

మీరు విండోస్ 7 ఉపయోగిస్తున్నారా? అయితే… మిమ్మల్ని మీరు డేంజర్ లో పడేసుకున్నట్లే.. అవును… నిజంగానే ఇది నిజం.. ఈ విషయం మీము చెబుతున్నది కాదు…. విండోస్ 7 ను తయారుచేసిన మైక్రోసాఫ్ట్ సంస్థే ఈ విషయాలను వెల్లడించింది.

విండోస్ 7 ఇప్పుడు సంభవిస్తున్న సైబర్ దాడులను తట్టుకోలేదట. సెక్యూరిటీ పరంగా చాలా లోపాలు ఉన్న విండోస్ 7 ను వాడితే వైరస్ అటాక్ కు గురికావాల్సిందేనని మైక్రోసాఫ్ట్ చెప్పింది.

ఇప్పటి టెక్నాలజీకి తగ్గట్లు విండోస్ 7 లో సెక్యూరిటీ ఫీచర్లు లేవని, అందుకే వెంటనే విండోస్ 7 నుంచి విండోస్ 8 లేదా 10 కు అప్ గ్రేడ్ కావాలని సూచించింది. ఇంకో మూడేళ్లలో విండోస్ 7 కు సెక్యూరిటీ ఫీచర్లను కూడా నిలిపివేయనున్నట్లు ప్రకటించింది విండోస్ 7.

2009 లో రిలీజయిన విండోస్ 7 కు 2020 వరకు మాత్రమే సెక్యూరిటీ ప్యాచెస్ ను అందిస్తుందట మైక్రోసాఫ్ట్. 2009 లో విండోస్ 7 వచ్చాక… ఎక్స్ పీ నుంచి చాలా మంది విండోస్ 7 కు మైగ్రేట్ అయ్యారు.

ఎక్స్ పీ లాగానే… విండోస్ 7 కూడా యూజర్ ఫ్రెండ్లీగా ఉండటం… ఈజీ సెర్చింగ్ ఆప్షన్స్ ఉండటంతో చాలా మంది యూజర్లు విండోస్ 7 ను ఉపయోగిస్తున్నారు.

రెండేళ్ల కింద… విండోస్ 8, 10 వర్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది మైక్రోసాఫ్ట్. ఇక, 2001 లో రిలీజయిన విండోస్ ఎక్స్ పి కి సెక్యూరిటీ ప్యాచెస్ ను 2014 లో నిలిపి వేసింది మైక్రోసాఫ్ట్. ఇక అదే బాటలో విండోస్ 7 కూ సెక్యూరిటీ ప్యాచెస్ ఆపేయడానికి సిద్ధమవుతున్నది.

అయితే… మూడేళ్ల కు ఇంకా టైమ్ ఉండటంతో… విండోస్ 7 జెన్యూన్ ఓఎస్ ను వాడుతున్న యూజర్లు తమ లైసెన్స్ పూర్తయ్యేవరకు ఈ ఓఎస్ ను ఉపయోగించుకోవచ్చు.

లైసెన్స్ వెర్షన్ కాకుండా… పైరసీ ఓఎస్ ను వాడేవాళ్లు మాత్రం వెంటనే దాన్ని తీసేసి.. విండోస్ 8 లేదా 10 లోకి అప్ గ్రేడ్ కావాల్సిందే.

 

 

 

 

 

 

Comments

comments