Home జాతీయ వార్తలు ఢిల్లీలో గద్వాల డాక్టర్ కిడ్నాప్

ఢిల్లీలో గద్వాల డాక్టర్ కిడ్నాప్

Doctor

ఢిల్లీ : ఢిల్లీలో పిజి వైద్య విద్యను చదువుతున్న గద్వాలకు చెందిన శ్రీనివాస్‌గౌడ్ కిడ్నాప్ అయ్యారు. ఇక్కడి మెట్రో ఆస్పత్రిలో ఆయన పిజి చదువుతున్నారు. గురువారం రాత్రి కారులో వెళుతుండగా క్యాబ్ డ్రైవర్ శ్రీనివాస్‌గౌడ్‌ను కిడ్నాప్ చేశాడు. ఐదు కోట్ల రూపాలు ఇస్తేనే శ్రీనివాస్‌గౌడ్‌ను విడిచి పెడుతానని క్యాబ్ డ్రైవర్ శ్రీనివాస్‌గౌడ్ చదువుతున్న కాలేజీకి ఫోన్ చేశాడు. ఈ కిడ్నాప్ వ్యవహారంపై ప్రీత్ విహార్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ ఘటనపై పోలీసులు విచారిస్తున్నారు. తమ కొడుకును విడిపించాలని శ్రీనివాస్‌గౌడ్ తల్లిదండ్రులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

Doctor Kidnapped  in Delhi