Home తాజా వార్తలు యువ వైద్యురాలు ఆత్మహత్య

యువ వైద్యురాలు ఆత్మహత్య

Doctor-Shilpa

అమరావతి: చిత్తూరు జిల్లా పీలేరులో యువ వైద్యురాలు మంగళవారం ఉదయం ఆత్మహత్య చేసుకుంది. జాగృతి అపార్ట్‌మెంట్‌లోని తమ ఇంట్లో డా.శిల్ప ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్‌వి మెడికల్ కాలేజీలో పీడియాట్రిక్ విభాగంలో శిల్ప పిజి చేస్తుంది. సోమవారం విడుదలైన పిజి ఫలితాల్లో శిల్ప ఫెయిల్ కావడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాలేజీ అధ్యాపకులు ఆమెను లైంగిక వేధింపులకు గురిచేశారని గతంలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారని, ఆ కక్షతోనే ఆమెను ఫెయిల్ చేశారని శిల్ప బంధువులు ఆరోపణలు చేస్తున్నారు.