Home తాజా వార్తలు పసికందును అమ్మేసిన వైద్యుడు

పసికందును అమ్మేసిన వైద్యుడు

Doctor

రంగారెడ్డి : ఇబ్రహీంపట్నంలో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఓ వైద్యుడు పసికందును 35వేల రూపాయలకు అమ్మేశాడు. ఈ ఆస్పత్రిలో ఓ మహిళ నాల్గో సంతానంగా ఆడశిశువుకు జన్మనిచ్చింది. డబ్బుపై ఆశతో ఓ డాక్టర్ ఆ పసికందును 35వేలకు అమ్మేశాడు. ఆ ఆడశిశువు ఐసియులో చికిత్స పొందుతుందని మొదట చెప్పాడు. ఆ తరువాత చనిపోయిందని బుకాయించాడు. ఆ వైద్యుడిపై అనుమానం రావడంతో శిశువు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఆ వైద్యుడు ఆ ఆడశిశువును అమ్మేసినట్లు పోలీసులు నిర్ధారించారు. వైద్యుడితో పాటు శిశువును కొనుగోలు చేసిన వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.