Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

పిజి సీటు రాలేదని డాక్టర్ ఆత్మహత్య

Anusha-Suicideహైదరాబాద్: పిజి సీటు రాలేదనే మనస్తాపంతో మాతురి అనూష (26) అనే డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడింది. అల్వాల్‌లోని మంజీరాకాలనీలో ఆమె ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు చేసుకుంది. వివరాలు.. ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలోని కళ్యాణిఖనికి చెందిన అనూష ఎంబిబిఎస్ పూర్తి చేసి సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్‌గా పనిచేస్తుంది. అనూష ఎన్నోసార్లు మెడికల్ పిజి ప్రవేశ పరీక్ష రాసినా సీటు రాలేదు. దీంతో ఆమె డిప్రెషన్‌కు గురైనట్టు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంట్లోనే ఉంటుంది. మృతురాలి సోదరుడు సాగర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

 

Comments

comments