Home తాజా వార్తలు రోగికి ఫంగస్ సెలైన్ ఎక్కించిన వైద్యులు..

రోగికి ఫంగస్ సెలైన్ ఎక్కించిన వైద్యులు..

DD

దుర్గాభాయి దేశ్‌ముఖ్ ఆసుపత్రిపై కేసు నమోదు
హైదరాబాద్: ఇటీవల గాంధీ ఆసుపత్రిలో ఫంగస్ స్లైన్ ఎక్కించడంతో రోగి మృతిచెందిన ఉధాంతం నగర ప్రజలు మరువక ముందే విద్యానగర్‌లోని దుర్గాభాయి దేశ్‌ముఖ్ ఆసుపత్రిలో మరో ఉధాంతం వెలుగు చూసింది. రాంనగర్‌కు చెందిన పి.వంశీకృష్ణ ఏడోదరగతి చదువుతున్నాడు. ఈనెల 28 రాత్రి 12గంటలకు పిడుసు రావడంతో వంశీ మామ శ్రీనివాస్ దుర్గాభాయి దేశ్‌ముఖ్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు చికిత్సలో బాగంగా స్లైన్ బాటిల్‌ను పెట్టారు. సగం బాటిల్ వంశీకృష్ణకు ఎక్కిన అనంతరం కుటుంబసభ్యులు స్లైన్ బాటిల్‌ను గమనించడంతో అందులో ఫంగస్ ఉన్నట్టుగా గుర్తించారు. ఈ విషయాన్ని ఆసుపత్రి యాజామాన్యానికి తెలిపిన పట్టించుకోకపోవడంతో వారు నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఆసుపత్రిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. పరీక్షల నిమిత్తం స్లైన్ బాటిల్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. వెంటనే ఈ ఆసుపత్రి నుంచి వంశీకృష్ణను వేరె ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు.
చర్యలు తీసుకోవాలి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని వంశీకృష్ణ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగినా ఆసుపత్రుల్లో మార్పు రావడం లేదని ఆరోపించారు. ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్షంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని వారు ఆరోపించారు.

పిచ్చుకపై బ్రహ్మాస్త్రం: రాంనగర్ కు చెందిన వంశీకృష్ణకు ఫిట్స్ రావడంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. దీంతో డాక్టర్ల సలహామేరకు అక్కడి నర్సు ఒకరు అత్యవసరంగా సెలైన్ ఎక్కించారు. మొదటి బాటిల్ సరైనదే. అనంతరం రెండో బాటిల్ సెలైన్ ను బాలుడికి ఎక్కిస్తుండగా ఫంగస్ను గుర్తించి నర్సుకు తెలపడంతో వెంటనే సెలైన్ నీడిల్ ను బాలుడి శరీరం నుండి వెంటనే తీసివేశారు. ఈ విషయమై ఆర్ఎంఓ డాక్టర్ ఉమాపతికి ఫిర్యాదు చేయగా సదరు నర్స్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో బాధితుని కుటుంబ సభ్యులతోపాటు అక్కడి రోగులు బంధువులు ఆర్ఎంఓతో వాగ్వాదానికి దిగారు. జరిగిన తప్పుకు ఆస్పత్రి యాజమాన్యం బాధ్యత వహించాల్సిందిపోయి నర్సుపై చర్యలు తీసుకోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఆసుపత్రికి కావాల్సిన సామాగ్రిని కొనుగోలు చేస్తున్నది యాజమాన్యం అనీ, కొనగోలు చేసే విషయంలో లాలూచీలకు పాల్పడి పర్చేజింగ్ అధికారులే తప్పుకు బాధ్యత వహించాలని డిమాండ్  చేశారు. ఆసుపత్రి యాజమాన్యం చేసిన తప్పునకు చిన్న ఉద్యోగులైన నర్సులపై చర్యలు తీసుకుంటామనడం సిగ్గుచేటన్నారు. ఈ విషయమై తెలంగాణ వైద్య విధాన పరిషత్ కు ఫిర్యాదు చేయనున్నట్లు బాధితుని బంధువులు తెలిపారు.

దోచేస్తున్న ఆసుపత్రి వర్గాలు: పేరుకు ట్రస్టు ఆస్పత్రి కానీ, వచ్చిన రోగులను నిండా ముంచేస్తున్నారని ఆసుపత్రికి వచ్చిన రోగులు, వారి బంధువులు ఆరోపిస్తున్నారు. ఎంప్లాయిస్ హెల్త్ స్కీం కింద చికిత్స నిమిత్తం వచ్చిన రోగుల నుండి వేలకువేలు ఫీజులు ముందుగానే కట్టించుకుంటారనీ, కానీ దానికి తగ్గట్టుగా వసతి కల్పించడంలేదని ఆరోపిస్తున్నారు. వైద్యులు నైపుణ్యం కలిగిన వారు ఉన్నప్పటికీ రోగులకు ఇచ్చే ప్రత్యేక గదులు మాత్రం అపరిశుభ్రంగా ఉంటున్నాయని అన్నారు. వార్డ్ బాయ్స్, ఆయాలు, సెక్యూరిటీ గార్డులు, బైక్ పార్కింగ్ నిర్వాహకులు రోగులనుండి డబ్బులు డిమాండ్ చేసి దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోగుల బంధువులు.

Doctors attached to the patient’s fungus saline