Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

అవిభక్త కవలల ఆపరేషన్ సక్సెస్

Doctors begin surgery on conjoined twins

మెల్‌బోర్న్ : భూటాన్‌కు చెందిన 15 నెలల అవిభక్త కవలలను ఆస్ట్రేలియా డాక్టర్లు ఆపరేషన్ ద్వారా వేరు చేశా రు. శుక్రవారం జరిగిన ఈ శస్త్రచికిత్స విజయవంతం కా వడంతో నిమా, దవా కవలలకు కొత్త జీవితాలు దక్కినట్లు అయింది. మొండెం అతుక్కుపోయి జన్మించిన ఈ కవలల మనుగడపై పలు అనుమానాలు తలెత్తిన దశలో ఆ స్ట్రేలియాకు చెందిన 20 మంది వైద్యుల బృందం ఆరు గంటల పాటు ఆపరేషన్ చేసి విజయవంతంగా వారిని విడదీశారు. పలువురు నర్సులు ఈ ప్రక్రియలో సహకరించారు. ఈ కవలల కాలేయం తప్ప ఇతర అవయవాలు ఏమీ అతుక్కుపోయి ఉండకపోవడంవల్ల శస్త్రచికిత్స కొంత మేర తేలిక అయిందని,ఇదేమంత విస్మయం ఏమీ కాదని సర్జరీ బృందం లీడర్ డాక్టర్ జో క్రెమెరీ తెలిపారు. స్థానిక రాయల్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో ఈ అరుదైన ఆపరేషన్ జరిగింది. చాలా నెలలుగా ఈ అవిభక్త కవల బాలికల ఆరోగ్య పరిస్థితిని గమనిస్తూ ఇప్పుడు సరైన సమ యం రావడంతో క్లిష్టమైన శస్త్రచికిత్స జరిపినట్లు వైద్యులు తెలిపారు. భూటాన్‌కు చెందిన ఈ పిల్లల తల్లి ఒక ధార్మి క సంస్థ సాయంతో తన పిల్లల ఆపరేషన్ కోసం నెల రోజుల క్రితం ఇక్కడికి వచ్చారు. సంరక్షణ ప్రక్రియల తరువాత ఆపరేషన్ నిర్వహించాల్సి వచ్చిందని వైద్య బృందం తెలిపింది.

Doctors begin surgery on conjoined twins

Telangana News

Comments

comments