Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

వైద్యుల రిటైర్మెంట్ 65

ప్రభుత్వ డాక్టర్ల ఉద్యోగ కాలం పెంచుతామని రాష్ట్రాలు కూడా పాటించాలని ప్రకటించిన ప్రధానమంత్రి

pmసహరన్‌పూర్: ప్రభుత్వ డాక్టర్ల రిటైర్మెంట్ వయో పరిమితిని 65 ఏళ్లకు పెంచుతామని ప్రధాని మోడీ వెల్లడించారు. సహారాన్‌పూర్ సభలో ఆయన ఈ ప్రకటన చేశారు. కేంద్రం ఒక్కటే కాదు రాష్ట్రాలు కూడా ఈ చర్య తీసుకోవాలని దీని వల్ల వైద్యులు ప్రజలకు మరింత ఎక్కువ కాలం సేవలు అందించేందుకు వీలేర్పడుతుందని వెల్లడించారు. ఈ వారంలోనే కేంద్ర ప్రభుత్వం డాక్టర్ల రిటైర్మెంటు పరిమితిని పెంచేందుకు నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. వైద్యులు పేదల సేవలకు అంకితం కావాలని, కనీసం ఏడాదికి 12 రోజులు అయినా వారు పేద గర్భిణులకు ఉచిత సేవలు, కాన్పుల సాయాన్ని అందించాల్సి ఉందని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో రెండేళ్ల కిందట ఈ రోజులలో పూర్తిగా నిరుత్సాహ నిస్తేజ వాతావరణం ఉండేదని , ఇప్పుడు విశ్వాసపు వాతావరణం నెలకొందని ప్రధాని తెలిపారు. ప్రగతితోనే దేశం దేశ ప్రజలు ఆత్మవిశ్వాసం పొందగల్గుతారని, ప్రగతితోనే దేశం పురోగమిస్తుందని , ఈ ప్రగతి పథకంలో దేశ ప్రజలంతా పాలుపంచుకోవాలని , తనకు సహకారం అందించాలని కోరుకుంటున్నానని ప్రధాని తెలిపారు.

Comments

comments