Home ఆదిలాబాద్ వైద్యులు సేవా దృక్పథంతో పనిచేయాలి: కలెక్టర్

వైద్యులు సేవా దృక్పథంతో పనిచేయాలి: కలెక్టర్

adilabadఉట్నూర్: వైద్యులు సేవ దృక్పథంతో పని చేసి ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కలిగేల వైద్య సేవలందించాలని జిల్లాకలెక్టర్ జగన్‌మోహన్ అన్నారు. శుక్రవారం స్తానిక కేబీ ప్రాంగణంలోని పీఎమ్మార్సీలోని రాష్ట్రీయ బాలల స్వస్థ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. వైద్యులు తమ తమకు కేటాయించిన మండలంలో స్థానికంగా ఉంటూ ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కలిగేల నిబద్దత, సేవాదృక్పథంతో పని చేయాలన్నారు. గ్రామాల్లో 18 సంవత్సరాల లోపు ఆశ్రమ పాఠశాలు, ప్రాథమిక పాఠశాలలు,ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు అనారోగ్యం భారిన పడ కుండా మెరుగైన వైద్య సేవలందించాలన్నారు. జ్వరం భారిన పడిన విద్యార్థుల రక్త పరీక్షలు నిర్వహించి వైద్య సేవలందించాలన్నారు. గ్రా మాల్లో సందర్శించి సీజనల్ వ్యాధులు ప్రభలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా 3 నెలల పాటు ప్రత్యేకమైన శ్రద్ద్ధ తీసుకోని తగు సేవలందించాలన్నారు. వైద్యులు గ్రా మాలకు వెల్లేందుకు ప్రతి క్లస్టర్‌కు 2 వాహనాలు కేటాయించడం జరిగి ందన్నారు. ఈ సమావేశంలో ఐటిడిఏ పిఒ ఆర్వీ కర్ణన్, జిల్లా వైద్య ఆరో గ్య శాఖ అధికారి జలపతినాయక్, డిఎంవో అల్హం రవి, ఏజెన్సీ అదనపు వైద్యాధికారి ప్రభాకర్‌రెడ్డి, ఆర్‌బిఎస్‌కే జిల్లా కో ఆర్డినేటర్ సుంకన్న, ఐటిడిఏ డిడి రాంమూర్తి, ఎస్‌పీహెచ్‌వోలు, వైద్యాధికారులున్నారు.
మాత శిశు మరణాలు జరగకుండ చూడాలిగర్భిణీలు ప్రభుత్వ ఆస్పత్రిలోనే కాన్పులు చేసుకునేల చూసి మాత శిశు మరణాలు జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ జగన్‌మోహన్ ఆదేశిం చారు. శుక్రవారం స్థానిక కేబీ ప్రాంగణంలోని పీఎమ్మార్సీలోని ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీలు, ఎఎన్‌ఎంలు, వైద్యులతో సమావేశం నిర్వ హించారు. కాగజ్‌నగర్, సిర్పూర్(టి), ఆసిఫాబాద్, చెన్నూర్, వేమన పల్లి, దహెగాం, వాంకిడి, కెరమెరి, రెబ్బెన తదితర క్లస్టర్ పరిధిలోని గ్రా మాల్లో గర్భిణీలు ఆస్పత్రులకు వెల్లకుండ ఇంట్లోనే కాన్పులు చేయించు కుంటున్నరని దినికి గల కారాణాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా అయన పాల్గొని మాట్లాడుతూ ఇంట్లో కాన్పులు చేసుకుంటే తల్లి, బిడ్డ ఆనారోగ్యం భారిన పడి చనిపోయే ప్రమాదం ఉందని ప్రభుత్వ ఆస్పత్రి లో కాన్పులు చేసుకుంటు అన్ని విధాలుగా తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటా రని వారికి క్షేత్ర స్థాయిలో ఆవగాహణ కల్పించాలన్నారు. గర్భిణిలు ప్రతి రోజు అంగన్‌వాడీ కేంద్రంలో పౌష్టికాహారం తీసుకోని, ఐరస్ మాత్రలు వాడేల చూడాలన్నారు. కొలాం గూడాల్లో గర్భిణీలకు రాత్రి పూట భోజనం అందించాలన్నారు. ఎంతైన ప్రదేశాల్లో ఉన్న గ్రామాలకు ఎఎన్‌ఎంలు వెల్లేందుకు ద్విచక్ర వాహాన సౌకర్యం కల్పించన్నుట్లు తెలి పారు. సమావేశానికి హజరుకాని అంగన్‌వాడీ కార్యకర్తలను సస్పెండ్ చేయాలని ఐసిడిఎస్ పీడిని ఆదేశించారు. అంతకుముందు ఉట్నూర్ ఎక్స్‌రోడ్డులోని చీమనాయక్ తాండలో జిల్లా కలెక్టర్ జగన్‌మోహన్ మొక్కలను నాటారు. ఈ కార్యక్రమాల్లో ఐటిడిఏ పీవో ఆర్వీ కర్ణన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జలపతినాయక్, ఏజెన్సీ అదనపు వైద్యాధికారి ప్రభాకర్‌రెడ్డి, డిఎంవో అల్హం రవి, ఐసిడిఎస్ పీడీ పద్మా వతి, నాగాపూర్ సర్పంచ్ హరినాయక్, ఐటిడిఏ ఎపీవో జనరల్ కుంర నాగోరావ్, ఈజీఎస్ ఎపీవో జగ్దేరావ్‌లు తదితరులున్నారు.