Home ఎడిటోరియల్ యుద్ధమొస్తే రెడీయేనా?

యుద్ధమొస్తే రెడీయేనా?

War-Cartoon

పాకిస్థాన్‌నుంచి నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదుల చొరబాట్ల కు ప్రతిరాత్రి ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. తరచుగా అక్కడ కవ్వింపు కాల్పులు కూడా జరుగు తున్నాయి. గత ఐదేళ్లలో ఎన్నడూ లేనంతగా అక్కడ చొరబాట్లు, కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటు న్నాయి. గడచిన వేసవిలో కశ్మీర్‌లో ఉగ్రదాడుల సంఖ్య కూడా పెరిగింది. సిక్కిం సెక్టార్‌లోని డోక్లాం వద్ద చైనా సైన్యం తో ఘర్షణ వాతావరణం గత రెండు నెలలుగా సాగుతోంది.
చైనా ప్రభుత్వ అధీనంలోని ప్రచార సాధనాలు భారత్‌పై నిప్పు లు చెరుగుతూనే ఉన్నాయి. చైనాపాకిస్థాన్ ఆర్థిక కారిడార్ (సిపిఇసి) ఆ రెండు దేశాల సైనిక పరమైన సఖ్యతను ముందు ముందు మరింతగా పెంచవచ్చు. రెండు వైపుల నుంచి ఘర్షణలు ఎదురయ్యే ప్రమాదం పొంచి వుంది. ఇదే సమయంలో భారతదేశ భద్రతా వాతావరణం దిగజారుతోంది.
చైనా, భారత్ మధ్య గత నెలలో యుద్ధ ప్రకటనలు సాగుతున్న తరుణంలో భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) మన మందు గుండు సామాగ్రి కొరతపై నివేదికను విడుదల చేశారు. ఇతర రకాల సైనిక పరికరాల కొరత కూడా తీవ్రంగానే ఉన్నట్లు ఆ నివేదిక తెలిపింది. అందువల్ల దేశరక్షణ సన్నద్ధత ప్రస్తుతం బాగా కుంటుపడి ఉన్నట్లు అర్థమవుతోంది. సైనిక దళాల మాజీ అధిపతి జనరల్ వి.కె. సింగ్ దీనిని ‘కీలక లోపం’గా పేర్కొన్నారు. తక్షణమే ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలని సూచించారు.
కొంత కాలంపాటు యుద్ధం జరిగితే మందుగుండు సామాగ్రి కొరత విరుద్ధ ప్రభావం చూపిందని కాగ్ తెలిపింది. 2013 మార్చిలో కాగ్ నివేదిక చెప్పిన ప్రకారం టాంకులు, శతఘ్ని తుపాకులు సహా వివిధ రకాల ఆయుధాల కొరత మనకు తీవ్రంగా ఉంది. యుద్ధం తల ఎత్తితే 10రోజుల పాటు కూడా సరిపోవని కాగ్ తెలిపింది. కాగ్ అలా హెచ్చరించిన తరువాత పరిస్థితిలో కొంత మెరుగుదల చోటు చేసుకొన్నప్పటికీ ఇంకా సైన్యంలో 40 శాతం ఆయుధాలకు కొరత ఉంది. అందువల్ల ఇప్పటికీ 10 రోజులకు మించి పోరాటం చేసే సామర్థం మన సైన్యానికి లేదు.
కార్గిల్‌లో ఎదురైన కష్టం
1999లో కార్గిల్ యుద్ధం 50 రోజులపాటు సాగింది. అప్పట్లో 155 ఎంఎం తుపాకీ గుళ్లు 50,000 రౌండ్లు దక్షిణాఫ్రికా నుంచి దిగుమతి చేసుకున్నాము. అటువంటి సంక్లిష్ట పరిస్థితి భవిష్యత్తులో ఏర్పడకుండా ఉండాలంటే ఆయుధ నిల్వలు పెంచడంపై దృష్టి పెట్టాలి. ఎప్పటికప్పుడు సరఫరాలు సాగేలా జాగ్రత్తగా చూడాలి. సైన్యానికి సంబంధించిన ఇతర అనుబంధ సేవలు కూడా చెప్పుకో దగ్గ విధంగా లేవు. మన నౌకాదళం సముద్రాలలోకి చొచ్చుకు పోయే సమర్థతను అంతగా పెంపొందించుకోలేదు. కానీ చైనా పీపుల్స్ లిబరేషర్ ఆర్మీ(పిఎల్‌ఎ) వారి నౌకాదళం హిందూ మహాసముద్రం లోకి దూసుకురావడానికి సిద్ధంగా ఉంది.
అత్యంత వేగంగా అది స్థావరాలను నెలకొల్పుతూ, రేవు సౌకర్యా లను పెంచుకొంటోంది. గత ఐదేళ్లలో మన నౌకాదళంలో ప్రమాదా లు తరచూ చోటు చేసుకున్నాయి. ఐఎన్‌ఎస్ సింధు రక్షక్, ఐఎన్‌ఎస్ సింధురత్న జలాంతర్గామి ప్రమాదాలు భారీ ఎత్తున జరిగాయి. ఎప్పుడో మార్చవలసిన జలాంతర్గామి బ్యాటరీలు ఇప్పటికీ వాడు తున్నారు. ఆరు స్కార్పీన్ జలాంతర్గాములను దేశీయంగా ఉత్పత్తి చేసే కార్యక్రమంలో ఇప్పటికే ఐదేళ్ల ఆలస్యం జరిగింది.
వైమానిక దళ బలహీనత తీవ్రం
ఇక మన వైమానిక దళం పోరాట శక్తి 32-33 స్కాడ్రన్లకు పడి పోయింది. దశాబ్దం క్రితం ఇది 39 స్క్వాడ్రన్లుగా వుండేది. భవిష్యత్తు లో ఎదురయ్యే సవాళ్లను దీటుగా ఎదుర్కొడానికి 42-45 స్కాడ్రన్లు అవసరం. మిగ్ 21, మిగ్ 27 వంటి కాలం చెల్లిన యుద్ధ విమానా లు, పాతపడిపోయిన హెలికాప్టర్లు ఇప్పటికీ సేవలు అందిస్తున్నాయి.
వైమానిక దళ రక్షణ కార్యకలాపాలు నౌక నుండి గురిపెట్టే క్షిపణి వ్యవస్థలు చాలా తక్కువ ఉన్నాయి. దేశీయంగా పరిశోధన, అభివృద్ధి పథకాలు కూడా తగినంతగా లేవు. కాలహరణం, వ్యయ భారం ఈ పథకాలను కుంగదీస్తున్నాయి. ఉగ్రవాదుల దాడిని తిప్పి కొట్టడానికి వైమానిక స్థావరాలను పటిష్ట పరిచే పని ఇంకా పూర్తి కాలేదు. పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై గత ఏడాది జనవరిలో జరి గిన దాడి తర్వాత ఇప్పటికీ ఆ పని పూర్తి కాకపోవడం శోచనీయం.
సైన్యంలో కూడా అదే పరిస్థితి
సైన్యంలో శతఘ్నుల ఆధునీకరణ కార్యక్రమం స్తంభించింది. తక్షణమే 155 ఎంఎం /52 – కాలిబర్ తుపాకులు 3000 దాకా అవ సరం. పాతబడిన హోవిట్జర్ల స్థానే ఆ తుపాకులను సైన్యానికి అందిం చాలి. ప్రస్తుతం ఎం 777 155 ఎంఎం / 45- కాలిబర్ హొవిట్జర్లను అమెరికా నుంచి 145 దాకా కొనడానికి ఒప్పందం కుదిరింది. మరో 114 తుపాకులను (155 ఎంఎం /45- కాలిబర్ ధనుష్ హొవిట్జర్లు ) దేశీయంగా ఉత్పత్తి చేసే ప్రతిపాదన ఉంది. వాటిని బోఫోర్స్ తుపాకుల డిజైన్ ఆధారంగా రూపొందిస్తారు.
వైమానిక రక్షణ, సైనిక వైమానిక కేంద్రాలకు కూడా పాతపడి పోయిన పరికరాలు ఉన్నాయి. వాటి పోరాట సామర్థం చాలా వరకు పడిపోయింది. ఆధునిక యుద్ధాలను రాత్రిపూటే సాగించడం ఆనవాయితీ. అయితే మన సైన్యం ఆయుధ వాహనాలు రాత్రి పూట యుద్ధానికి పనికి రాకుండా ఉన్నాయి.
రష్యా నుంచి అందిన టి-90 ఎస్ టాంకులు 650 మాత్రమే రాత్రిపూట పోరాట సామర్థం కలిగి ఉన్నాయి. ప్రస్తుతం ఎన్‌డిఎ ప్రభుత్వం ఆమోదించిన రూ. 1,50,000 కోట్ల ఆయుధ సేకరణ పథకం పూర్తికి 5 ఏళ్లు పడుతుంది. సరిహద్దు ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో మనం పోరాట సామర్థాన్ని పెంచు కోవలసిన తక్షణ అవసరం ఎంతైనా ఉందని రక్షణ నిపుణులు సూచిస్తున్నారు.

– గుర్‌మీత్ కాన్వాల్