Home అంతర్జాతీయ వార్తలు హెచ్ 1బిలో పెద్దగా మార్పులుండవు

హెచ్ 1బిలో పెద్దగా మార్పులుండవు

H1B-VISA-1

హెచ్ 4 యథాతథం 

ట్రంప్ సర్కార్ వెనుకడుగు

అమెరికాలోని భారతీయ వీసాదారులకు ఊరట

న్యూఢిల్లీ: హెచ్ 1బి వీసాల్లో పెద్దగా మార్పు లు చేయడం లేదని, అలాగే హెచ్ 4 వీసా పాలసీలో కొత్తగా ఏ నిబంధనలను చేర్చడం లేదని అమెరికా డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ కార్ల్‌సన్ చెప్పారు. ఇమ్మిగ్రేషన్ చట్టాన్ని పూర్తిగా మారుస్తామని కొంతకాలం క్రితం డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఉద్యోగ వీసా, పని అనుమతి ఇండియాలోని వారికి ఇవ్వడానికి అమెరికా ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ మారికె ఎల్ కార్ల్‌సన్ ఢిల్లీలో చెప్పారు. హెచ్ 1 బి వీసా కలిగిన వారి భాగస్వామి అమెరికాలో పని చేయడానికి బరాక్ ఒబామా హయాంలో హెచ్-4 వీసా ద్వారా అనుమతి ఇచ్చారు. ఈ వీసాతో అమెరికాలో పని చేస్తున్న ఇండియాకు చెందిన జీవిత భాగస్వాములు నిజానికి అత్యంత ప్రతిభ కలిగిన వారు కావడం విశేషం. ట్రంప్ ప్రకటించినట్టు హెచ్ 1బిలో మార్పులు జరిగితే ఇండియాకు చెందిన 70 వేల మంది అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయి వీధిన పడతారు. అయితే ట్రంప్ ప్రతిపాదన కార్యరూపం దాల్చకుండా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని గత నెలలో విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటించారు. ప్రతి సంవత్సరం మే 28న జరిపే మీడియా సమావేశంలో పాల్గొన్న ఆమె, ట్రంప్ హెచ్-4 వీసాపై సమీక్ష జరుపుతున్నారని, ఇండియా వారికి ఎటువంటి ఇబ్బందులు వచ్చే మార్పులు ఉండవని సూచాయగా చెప్పారు.
ఢిల్లీలో ఏర్పాటు చేసిన స్టూడెంట్ వీసా డే సందర్భంగా అమెకాలోని అనేక యూనివర్శిటీల్లో ఉన్నత చదువుల కోసం అప్లికేషన్లు దాఖలు చేశారు. ఈ స్టూడెంట్ వీసా దినోత్సవంలో ఢిల్లీలోని అమెరికా దౌత్య అధికారులు, చెన్నై, హైదరాబాద్, ముంబైకి చెందిన అమెరికా కాన్సులేట్ జనరల్స్ హాజరయ్యారు. ఈ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన 4 వేల మంది విద్యార్థులకు వారు స్వాగతం పలికారు. వారంతా అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో చదవడానికి స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. 2017లో ఇండియాకు చెందిన 1,86,000 మంది విద్యార్థులు అమెరికా విద్యా సంస్థల్లో ఉన్నత విద్యని అభ్యసించడానికి అడ్మిషన్ కోసం అప్లయ్ చేశారు. ఒక దశాబ్దం కిందటి సంఖ్యతో పోలిస్తే ఇది రెట్టింపు సంఖ్య. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 12 శాతం ఎక్కువని అమెరికా కాన్సలేట్ అంచనా వేసింది. అమెరికాలో ఉన్నత చదువులు చదవడానికి వస్తున్న విద్యార్థుల సంఖ్యలో ఇండియాకి చెందిన వారు రెండవ స్థానంలో ఉన్నారని ప్రకటించింది. అమెరికాలో చదువుతున్న మొత్తం విద్యార్థుల్లో ఇండియాకి చెందిన విద్యార్థులు 17 శాతం ఉంటారని తేలింది.