Home లైఫ్ స్టైల్ ‘పాలిప్స్’కు శస్త్రచికిత్సే మార్గమా?

‘పాలిప్స్’కు శస్త్రచికిత్సే మార్గమా?

polypsమానవ శరీర నిర్మాణంలో ముక్కుకు అత్యంత ప్రాధాన్యత  ఉంది. మనం నిత్యం శ్వాస తీసుకోవటం,  వదలటం ముక్కు ద్వారానే చేస్తుంటాం. ముక్కులో ఎటువంటి అడ్డంకి లేనంత వరకు ప్రతీ ఒక్కరు శ్వాసను తేలికగా  తీసుకోగలుగుతారు. కానీ కొంత మందిలో ఇన్‌ఫెక్షన్స్, ఇతరత్ర కారణాల వల్ల ముక్కులోని మ్యూకస్ మెంబ్రేన్ ఉబ్బి కాయలాంటి నిర్మాణాలు ఏర్పడి ముక్కు శ్వాసకి అడ్డంకిగా మారుతున్నాయి. ఇటువంటి కాయల వంటి నిర్మాణాలనే వైద్యపరిభాషలో ‘ పాలిప్స్’ అంటాం. పాలిప్స్ ముక్కులో ఉండటం వల్ల ఊపిరి సరిగా ఆడకుండ ఉండి, ఏదో అడ్డుపడినట్టుగా ఉంటుంది. జలుబు అప్పుడప్పుడు చేయడం సహజం. అలాకాకుండా సంవత్సరం పొడువునా కాలంతో సంబంధం లేకుండా దీర్ఘకాలికంగా జలుబుతో బాధపడే వారు ఎక్కువగా “పాలిప్స్’ సమస్యను ఎదుర్కుంటున్నారు. ఈ సమస్యను సకాలములో గుర్తించి హోమియోవైద్య చికిత్స తీసుకోవటం వల్ల ‘పాలిప్’ సమస్యను శస్త్రచికిత్స లేకుండనే నివారించ వచ్చును.

కారణాలు:

8 తరుచుగా నాసల్ ఎలర్జీ ఇన్‌ఫెక్షన్, లేదా వైరస్ బాక్టీరియా ఇన్‌ఫెక్షన్స్ వల్ల
8 దీర్ఘకాలికంగా జలుబుతో బాధపడటం వల్ల.

లక్షణాలు:

 • ముక్కులోని సబ్‌మ్యుకోసా జిగురు పొరలు ఉబ్బి ముక్కులు దిబ్బడ వేసి రాత్రి పడుకున్నప్పుడు ఊపిరాడకుండ ఉండును. తుమ్మినప్పుడు కొన్ని సందర్భాలల్లో రక్తం పడుతుంది.
 • శ్వాస సరిగా ఆడకపోవటం వల్ల, నోటితో గాలి తీసుకోవటం వల్ల గురకవస్తుంది.
 • వాసన తెలియకుండ ఉండును. పలుచని స్రావాలు ముక్కు నుంచి కారుతుంటాయి.
 • మాట ముక్కుతో మాట్లాడుతున్నట్లుగా ఉంటుంది.
 • ముక్కులో మంట, దురదగా ఉండటం.
 • శరీరం వేడిగా జ్వరం లాగా ఉండటం, గొంతులో నొప్పిగా ఉన్నట్లు అనిపించటం.

జాగ్రత్తలు:

 • వ్యాధి ఆరంభంలోనే వైద్యుల దగ్గరకు వెళ్లటం వల్ల పాలిప్స్ పెరగకుండ జాగ్రత్త పడవచ్చును.
 • శీతల పానీయాలు, చల్లటి పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్స్, కేక్స్ మానేయాలి.
 • ధుమ్ము, ధూళి ఉన్న పరిసర ప్రాంతాలలోకి వెళ్ళకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఒక వేళ వెళ్లాల్సి వస్తే మాస్కు తప్పని సరిగా ధరించాలి.
 • సరిపడని పదార్థాలను గుర్తించి వాటిని కొద్ది రోజులు తినకుండా ఉండాలి.
 • వ్యాధి నిరోధక శక్తి పెరగటానికి పౌష్ఠికాహారం నిత్యం తీసుకోవాలి.
 • ప్రతి రోజు వ్యాయామం, బ్రీతింగ్ ఎక్సర్‌సైజులు చేయడం వల్ల వ్యాధి తీవ్రత తగ్గుతుంది.

చికిత్స: హోమియోవైద్యంలో పాలిప్స్‌కు మంచి చికిత్స ఉంది. వ్యాధి లక్షణాలను, వ్యక్తి మానసిక, శారీరక లక్షణాలను, పరిగణలోకి తీసుకొని మందులను ఎన్నుకొని వైద్యం చేసిన ‘ పాలిప్స్ ’ నుంచి విముక్తి పొందవచ్చును.
మందుల రకాలు

ట్యూక్రియం మారంవీరం: ముక్కులో కాయల వంటి నిర్మాణాలు ఉండి పురుగులు పాకుతున్నట్లుగా అనిపించును. ముక్కులు దిబ్బడ వేసి ఊపిరాడకుండ ఉండును. ఇటువంటి లక్షణాలున్న వారికి ఈ మందు తప్పక ఆలోచించ దగినది.
లెమ్నామైనర్: ముక్కులో కాయలు ఏర్పడి ముక్కు ఉబ్బి ఉండును. ముక్కు నుండి నొప్పి చెవి వరకు వ్యాపించి ఉండును. శరీరం వేడిగా జ్వరం లాగా ఉండటం, గొంతులో నొప్పిగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇటువంటి లక్షణాలున్న వారికి ఈ మందు ప్రయోజనకారి.
తూజా : ముక్కులో కాయలవంటి నిర్మాణాలుండి ఊపిరాడకుండ ఉండును. అలాగే తలనుండి తెల్లటి పొట్టు రాలుతూ, శరీరం పై “వార్ట్స్ ” ( పులిపిరికాయలు ) ఉండి డెండ్రాఫ్‌తో బాధపడే వారికి ఈ మందు ఆలోచించదగినది.
కాలిబైక్రోమికం: ముక్కులో పాలిప్స్ ఉబ్బి ఉండి ముక్కు పైభాగంలో తీవ్రమైన నొప్పి, ముక్కు పొడి ఆరిపోయి ఉంటుంది. ముక్కునుండి చిక్కని జిగురుతో కూడిన స్రావాలు, తీగలుగా సాగుతుంటాయి. స్రావం తెల్లగా, పసుపుగా, ఆకుపచ్చగా కారుతుంటాయి. ఈ లక్షణాలు ఉన్న వారికి ఈ మందు ప్రధానమైనది. ఈ మందులే కాకుండా కాల్కేరి యాఫ్లోర్, టుబర్కులినం, ఫెర్రం ఫాస్, కాలిమోర్, లేకసిస్, కాల్కేరియా కార్బ్, సల్ఫర్, వంటి మందులను లక్షణ సముదాయాన్ని అనుసరించి డాక్టర్ సలహ మేరకు వాడుకుని ‘పాలిప్స్ ’ బాధనుండి ఉపశమనం పొందవచ్చును.