Search
Monday 24 September 2018
  • :
  • :

రైతును కరిచి చంపిన కుక్కలు

DOGతబ్రా : ఓ రైతును వీధి కుక్కలు కరిచి చంపాయి. ఈ సంఘటన హరియానాలోని తబ్రా గ్రామంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం సాయంత్రం గ్రామానికి చెందిన శ్రీరామ్ పొలానికి వెళ్లాడు. తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో మందగా వచ్చిన వీధికుక్కలు అతడిపై దాడి చేశాయి. ఈ దాడిలో శ్రీరామ్ అక్కడికక్కడే చనిపోయాడు. చిన్నాభిన్నమైన అతడి మృతదేహాన్ని పొలాల్లో గుర్తించారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనే గ్రామంలో చోటు చేసుకుంది. మూడేళ్ల క్రితం నాలుగేళ్ల బాలుడిపై కుక్కలు దాడి చేసి చంపేశాయని గ్రామ ప్రజలు తెలిపారు.

Comments

comments