Home ఆఫ్ బీట్ వీడియోలు పాపం.. పప్పీ (వీడియో)

పాపం.. పప్పీ (వీడియో)

Dog Ear Falls Offథాయ్ లాండ్ కు చెందిన ఓ పొమేరియన్ కుక్క(పప్పీ) యజమానురాలిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. దీనికి కారణం ఆమె చేసిన ఓ పాడుపని. పప్పీని అందంగా తీర్చిదిద్దాలని రెండు చెవులతో పాటు తోకకు సెలూన్ కు తీసుకెళ్లి ఎరుపు రంగు హెర్ డై వేయించింది. డై వేసి 40 నిమిషాల తరువాత కడిగేసి చూస్తే.. చెవులు కిందికి వంగిపోయి, దద్దులు వచ్చేశాయి. ఇదే విషయమై సెలూన్ వాళ్లను అడిగితే పర్వాలేదు… రెండు మూడు రోజుల్లో అంతా సెట్ అయిపోతుందని సెలవిచ్చారు. అయితే డై కాస్తా చర్మంపై అలెర్జీకి దారితీసింది. కొన్ని రోజుల తర్వాత ఉన్నట్టుండి ఒక చెవి కూడా ఊడిపోయింది. అనంతరం తన పప్పీకి వచ్చిన అలెర్జీ, చెవి ఊడిపోయిన విషయాలను ప్రస్తావిస్తూ దాన్ని యజమానురాలు నెటిజన్ల సలహాల కోసం ఫోటో స్లైడ్స్ తో కూడిన వీడియోను పోస్ట్ చేసింది. అంతే.. అది చూసిన నెటిజన్లు ఆమెపై విరుచుకుపడుతున్నారు. ఓ మూగజీవి పట్ల ఇంతా బాధ్యతరాహిత్యంగా వ్యవహరిస్తావా? అంటూ కడిగిపారేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Dog Ear Falls Off After Owner Colours Them Red