Home అంతర్జాతీయ వార్తలు పాపను కాపాడిన శునకం

పాపను కాపాడిన శునకం

DOGవాషింగ్టన్ : ఓ చిన్నారిని పాము కరవకుండా ఓ శునకం కాపాడింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఈఘటన జరిగింది. ఫ్లోరిడాలో ఓ ఇంట్లో పెంచుకుంటున్న జర్మన్ షెప్పర్డ్ శునకం హాస్. ఏడేళ్ల పాపను పాముకాటుకు బలవ్వకుండా రక్షించి ఇప్పుడు హీరో అయింది. ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఇంట్లోని గార్డెన్‌లో పాప ఆడుకుంటున్న సమయంలో పాము వచ్చింది. అదే సమయంలో అక్కడే ఉన్న రెండేళ్ల హాస్ పాముకు, పాపకు మధ్య వచ్చి నిలబడింది. పాము పాపను కాటేయబోతున్న సమయంలో శునకం అడ్డురావడంతో పాము కాటు హాస్‌పై పడింది. హాస్ పామును అడ్డుకోవడం ఒక్క క్షణం ఆలస్యమైనా పాప బలయ్యేది. హాస్‌ను పాము కాటేయడం కారణంగా దాని రెండు కిడ్నీలు పాడైపోయాయి. హాస్ ఆరోగ్యంపై ఆందోళన చెందిన దాని యజమానులు విరాళాల కోసం విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తికి చాలా మంది స్పందించారు. హాస్ చికిత్స కోసం ఇప్పటివ రకు 33వేల డాలర్లు వచ్చాయి. పాప ప్రాణాలు కాపాడిన హాస్‌కు ఏం కాకూడదని ఆ కుటుంబం ఆరాటపడుతోంది. హాస్ త్వరలోనే కోలుకుంటుందని వైద్యులు తెలిపారు. ఓ రెస్కూ సెంటర్ నుంచి రెండు నెలల క్రితమే హాస్‌ను ఆ పాప కుటుంబం తెచ్చుకుంది.