పెంపుడు జంతువుల్లో అత్యంత విశ్వాసం కలిగిన జంతువు శునకం. సాధారణంగా శిక్షణ ఇచ్చిన పెంపుడు కుక్కలకు ఎదైనా విసిరేసిన వస్తువులను తీసుకొని రమ్మంటే పరుగెత్తుకెళ్లి నోటితో పట్టుకొని మనదగ్గరకి తీసుకొస్తాయి. ఇది అందరికి తెలిసిన సంగతే. అయితే ఒక యజమాని తన పెంపుడు కుక్కలతో కలిసి తన ఇంటి పరిసరాల్లో సరదగా గడపడానికి బయటకొచ్చాడు. ఈ నేపథ్యంలో అతని పెంపుడు కుక్కల్లో ఓ కుక్క తన యజమాని దగ్గరున్నగోప్రో కెమెరాను నోటితో పట్టుకొని ఎవరికి దొరకుండా వేగంగా పరుగెత్తడం స్టార్ట్ చేసింది. దాని వెనకాలే మిగతా కుక్కలు సైతం పరుగెత్తసాగాయి. కెమెరాను ఆ కుక్క ఎక్కడ పడేస్తుందోనని ఆ వ్యక్తి కూడా వాటి వెనక రన్నింగ్ చేశాడు. కానీ దాన్నిపట్టుకోవడానికి యజమాని చాలా శ్రమ పడవలసి వచ్చింది. కెమెరా ఆన్‌లోనే ఉండటంతో కుక్క పరుగులు పెడుతున్న దృశ్యాలు అందులో రికార్డు అయ్యాయి. ఈ వీడియోను యాజమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అదికాస్తా ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు ఆ ఫన్నీ క్లిప్ ను 4.5 మిలియన్ల మంది చూడడం గమనార్హం. ఈ వీడియోలో ఆ శునకం ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ చూడటానికి చాలా సూపర్ గా ఉందంటున్నారు నెటిజన్లు.
Bless this doggo who stole a GoPro pic.twitter.com/tZwVdniJoQ
— Jon Christian (@Jon_Christian) July 29, 2018