Home వార్తలు శునకాల సొమ్ము మింగేశారు!

శునకాల సొమ్ము మింగేశారు!

కుక్కలు, కోతుల సంతతి తగ్గించేందుకు ఐదేళ్లలో రూ.39.93 వ్యయం
అయినా తగ్గని సంతతి
కాగితాలపైనే పనులు… క్షేత్రస్థాయిలో నిల్
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లలో గోల్‌మాల్
గ్రేటర్‌లో కుక్కల సంఖ్య ఐదులక్షల పైమాటే
రోజురోజుకు పెరిగిపోతున్న శునకాల సంఖ్య

Dogsమన తెలంగాణ/సిటీబ్యూరో: బల్దియాలో రోజురోజుకీ అవినీతి, అక్రమాలు యథేచ్ఛగా పెరిగిపోతున్నాయి. చివరకు మూగజీవాల పేరుతో కూడా అక్రమార్జనకు ద్వారాలు తెరిచారు. వాటి కోసం కేటా యించిన నిధులను ఏకంగా మింగేశారు. కోతులు, శునకాలు లాంటి జంతువుల సంఖ్య ను తగ్గించేందుకు ఐదేళ్ళకాలంలో ఏకంగా రూ.39.93 లక్షలు ఖర్చుచేసేశారు. అయినా శునకాలు, కోతుల బెడద తగ్గిందా అంటే అదీలేదు. రికార్డుల్లో మాత్రం ఆ సంఖ్య తగ్గినట్లు చూపించడంలో తమ హస్తలాఘ వాన్ని ప్రదర్శిస్తున్నారు. కానీ మహానగర పాల క సంస్థ(జిహెచ్‌ఎంసి) ఖజానా నుంచి మా త్రం వాటి పేరిట నిధులు దారిమళ్లాయి. ఏ రోజుకుకారోజు గ్రేటర్ హైదరాబాద్‌లో కుక్క లు, కోతుల సంతతి పెరిగిపోతూనే ఉంది. శునకాలు, కోతుల సంఖ్య తగ్గించేం దుకు వాటికి కుంటుంబ నియంత్రణ ఆపరేష న్లు చేస్తున్నామని కాగితాల్లో లెక్కలు చూపిస్తు న్నారు. కానీ క్షేత్రస్థాయితో మాత్రం వాటిని నిర్వహించిన దఖలాలు కనిపించడం లేదు. సరైన విధంగా కుక్కలకు కుంటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహిస్తే కుక్కల సంతతి ఎందుకు పెరుగుతుందనే విషయం మిలియన్ డాలర్ల ప్రశ్న. 2008 సంవత్సర కాలంలో జిహెచ్‌ఎంసి లెక్కల ప్రకారం నగరంలో రెండు లక్షల కుక్కలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం గ్రేటర్‌లో కుక్కల సంఖ్య ఐదు లక్షలకుపైగా పెరిగింది. 2008-09 ఆర్థిక సంవత్స రం నుంచి 2014-15 వరకు రూ.39.93 కోట్లు ఖ ర్చు చేసినట్లు లెక్కలు చూపిస్తున్నారు. ఐదు సంవ త్సరాల్లో ఇంతమొత్తంలో కుక్కలు, కోతులపై ఖర్చు చేస్తే మరి వాటి సంతతి ఎందుకు పెరిగిందనే విష యంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచార హక్కు చట్టం ద్వారా లోక్‌సత్తా గ్రేటర్ కమిటీ వివరాలు సంపాదించింది. జంతువుల కోసం ఖర్చు చేసిన వివరాలు విస్తుపోయేలా ఉన్నాయి. కుక్కలను తీసుకుపోయి వ్యాక్సిన్లు చేశామని వదిలిన కుక్కలు పిల్లలకు జన్మనిచ్చాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కడ చూసినా కుక్కల బెడదతో ప్రతిరోజు నగర వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి సమయాల్లో గుంపులు గుంపులుగా కుక్కలు సంచరిస్తున్నాయి. కుక్కల బెడదతో రాత్రివేళ సంచ రించాలంటే నగరవాసులు జంకుతున్నారు. ఇందు కు ఈ ఐదేళ్ళకాలంలో సుమారు 35 వేల కుక్కకాటు కేసులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నమోదయ్యాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్న వారి వివరాలు తెలిస్తే కుక్కకాటు కేసుల సంఖ్య మరింత పెరుగుతాయి. చిన్నారులు, వృద్ధులు, మహిళలపై కుక్కల దాడి కేసులు గ్రేటర్‌లో లెక్కలకు అందని సంఖ్యలో ఉంటాయని ప్రభుత్వ వైద్యులు తెలిపారు. వేల సంఖ్యలో ఉన్న కుక్కల సంఖ్య బల్దియా అధికా రులు అవినీతి అక్రమాలతో ప్రస్తుతం ఐదు లక్షలకు పెరిగిపోయింది. నియంత్రణ చర్యలు సరిగ్గా తీసు కుంటే వాటి సంఖ్య ఎందుకు పెరుగుతుందని నగర వాసులు ప్రశ్నిస్తున్నారు. ఒక ప్రాంతం నుంచి కుక్క లు, కోతులను పట్టుకపోవడం మరో ప్రాంతంలో వాటిని వదిలివేయడం లాంటి చర్యలకే పరిమితం అవుతున్నారని సర్వత్రా ఆరోపణలు వినిపిస్తున్నా యి. నిబంధనల ప్రకారం అయితే పట్టుకున్న కోతుల ను అటవీప్రాంతాల్లో వదలాల్సి ఉంటుంది. కానీ వా టిని పట్టుకొని కొంతకాలం అంబర్‌పేటలోని సంరక్ష ణ కేంద్రంలో పెట్టిన అనంతరం వాటిని నగర శివా రు ప్రాంతాల్లో వదిలేస్తున్నారని ఆరోపణలు విన్పిస్తు న్నాయి. శివారులో వదిలేసిన కోతులు తిరిగి నగరం లో ప్రవేశిస్తున్నాయి. దీంతో కోతుల బెడద ఎప్పటికీ తీరని సమస్యగా మారింది. జంతువులను పట్టుకునేం దుకు వివిధ పరికరాలు కొనుగోలు చేసేందుకు నిధు లు మంజురవుతున్నాయి. కానీ వాటిని కొనుగోలు చేయకుండానే బిల్లుల రూపంలో నిధులు తమ జేబు ల్లోకి వేసుకుంటున్నారని లోక్‌సత్తా ఆరోపించింది. ఐదు సంవత్సరాల కాలంలో రూ.39.93 కోట్లు ఖ ర్చు చేయగా, కుక్కల వాహనాలు(17)కు రూ.2.10 కోట్లు వ్యయం చేశారు. ఇక 2014-15లో ఖర్చుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కార్మికులకు రూ. 42 లక్షలు, కుక్కల వాహనాలకు రూ.36 లక్షలు, కోతులు పట్టుకోవడానికి రూ.16 లక్షలు, జంతువుల మృత్యు కళేబరాలను తరలించేందుకు రూ.52 లక్షలు, జంతువుల ఆహారం కోసం రూ.115 లక్షలు, బక్రిద్ పండుగ సందర్భంలో ఆవులను కాపాడేందుకు రూ.15.61 లక్షలు వ్యయం చేసినట్లు వివరాల్లో జిహెచ్‌ఎంసి వెటర్నరీ విభాగం అధికారులు పేర్కొన్నారు.
అవినీతి అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి : లోక్‌సత్తా
కుక్కలు, కోతుల నియంత్రణలో విఫలమైన జిహెచ్ ఎంసి వెటర్నరీ అధికారులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని లోక్‌సత్తా గ్రేటర్ హైదరాబాద్ కమిటీ అధ్యక్షులు రాము, ప్రధాన కార్యదర్శి సాంబిరెడ్డి, రాఘవయ్యలు డిమాండ్ చేశారు. 44,100 వీధి కుక్కలకు వ్యాక్సిన్ వేస్తే రూ.25 కోట్లు ఎలా ఖర్చు అయిందని వారు ప్రశ్నించారు. రూ.40 ఉన్న ఒక వ్యాక్సిన్, ఒక వీధికుక్కకు రూ.5 వేలు ఏవిధంగా ఖర్చు అయ్యిందో చెప్పాలన్నారు. సరైన చర్యలు తీసుకుంటే మరి కుక్కల సంఖ్య ఎందుకు పెరిగిందో అధికారులు సమాధానం చెప్పాలన్నారు. కూకట్‌పల్లి, ఎల్.బి.నగర్ సర్కిళ్ల పరిధిలో వ్యాక్సిన్ వేసిన 100 వీధి కుక్కలు తిరిగి పిల్లలకు జన్మనిచ్చాయన్నారు. 5 లక్షల కుక్కల గర్భనిరోధక వ్యాక్సిన్‌లపై ఎందుకు శ్రద్ధ చూపటం లేదని ప్రశ్నించారు. రాత్రి సమయాల్లో ఇళ్లకు వెళ్లాలంటే నగరవాసులు భయబ్రాంతులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోవాలన్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, శునకాల సంతతి పెరగకుండా సరైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.