Search
Wednesday 26 September 2018
  • :
  • :

బాలుడిపై పందుల దాడి…

pigs-attackఖమ్మం: మున్సిపాలిటీ పరిధిలోని బాపనకుంట గ్రామంలో బాలుడిపై పందులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన సంఘటన శనివారం మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… బాపనకుంట గ్రామానికి చెందిన సిలివేరు నవీన్ 10సంవత్సరాలు. తమ ఇంటి బయట స్నేహితులతో ఆడుకుంటూ ఉండగా పందులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చినట్లు బాలుడి తల్లిదండ్రులు తెలిపారు. ఇది చూసిన వారి పెంపుడు కుక్క బాలుడిని కాపాడుదామని ప్రయత్నించగా కుక్కను కూడా పందులు తీవ్రంగా గాయపర్చాయి. దీంతో కుక్క చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. దీంతో స్థానిక ప్రజలు మున్సిపాలిటీ వారిపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు మేల్కొని తక్షనమే పందుల స్వైరవిహారాన్ని అరికట్టాలని వారు ముక్త కంఠంతో కోరుతున్నారు.

Comments

comments