Home జిల్లాలు గిరిజన బాలుడిపై పిచ్చికుక్కల దాడి

గిరిజన బాలుడిపై పిచ్చికుక్కల దాడి

పరిస్థితి విషమం
హాస్టల్‌లో నీళ్లు లేకపోవడంతో తాగేందుకు బయటికి వెళ్లిన బాలుడు
వార్డెన్ నిర్లక్షమే కారణమంటున్న స్థానికులు
hydసిటీబ్యూరో: గిరిజన హాస్టల్ లో మూడో తరగతి చదువుతున్న ఓ బాలుడి పై వీధికుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడి పరిస్థితి విష మంగా ఉంది. వార్డెన్ నిర్లక్షం వల్లనే ఈ దాడి జరిగింది. హాస్టల్‌లో నాలుగు రోజుల నుంచి తాగేందుకు నీళ్లు లేకపోవడంతో గేటు దాటి వెళ్లడం వల్లనే ఈ ఘోరం జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన లక్ష్మణ్‌నాయక్ కొడుకు యన్.శ్రీకాంత్ (8) ఓల్డ్‌బోయిన్‌పల్లిలోని బాపూజీనగర్ గిరిజన బాలుర వసతి గృహంలో ఉంటూ స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మూడో తర గతి చదువుతున్నాడు. గురువారం సాయం త్రం నాలుగు గంటలకు నీళ్లు తాగేందుకు శ్రీకాంత్ హాస్టల్ గేటు దాటి బాపూజీనగర్‌వైపు వెళ్లాడు. అక్కడ బోరింగ్ వద్ద నీళ్లు తాగి తిరిగి హాస్టల్‌కు నడుచుకుంటూ వస్తుండగా…ఒక్కసారిగా నాలుగైదు వీధి కుక్కలు మూకుమ్మడిగా శ్రీకాంత్‌పై దాడికి పాల్పడ్డాయి. కంటి పై భాగం, తల, వీపు, చేతులపై తీవ్రంగా కాట్లు పడ్డాయి. విషయం గమ నించిన తోటి విద్యార్థులు శ్రీకాంత్‌ను రక్షించేందుకు విఫలయత్నం చెందారు. స్థానిక యువకులు వచ్చి కుక్కలను తరమికొట్టడంతో అప్ప టికే తీవ్ర గాయాలైన శ్రీకాంత్ స్పృహతప్పి నడిరోడ్డుపై పడిపో యా డు. స్థానికులే అతన్ని దగ్గరలో ఉన్న రాఘవేంద్ర ఆసుపత్రిలో చేర్పిం చి చికిత్స అందించారు. ఆసుపత్రి బిల్లు కూడా స్థానికులే కట్టారు. దాడి జరిగిన సమయంలో హాస్టల్‌లో ఉండాల్సిన వార్డెన్ లేడు.
వార్డెన్ నిర్వాకమే…
నాలుగైడు రోజుల నుంచి హాస్టల్‌లో తాగు నీరు లేదు. ఈ విషయంపై పిల్లలు పలుమార్లు వార్డెన్ గోపాల్‌కు మొరపెట్టుకున్నా సమస్య తీరలేదు. దీంతో హాస్టల్‌లో ఉండాల్సిన పిల్లలు తాగే నీరు కోసం గేటు దాటి బాపూజీనగర్‌లోకి వెళ్లి రావాల్సి వస్తున్నది. ఈ క్రమంలోనే శ్రీకాంత్ బయటికి రావడంతో వీధికుక్కలు దాడి చేశాయి. వార్డెన్ గోపాల్ గురువారం అసలు హాస్టల్‌కే రాలేదు. స్పెషల్ డ్యూటీపై బయటికి వెళ్లాడని తెలిసింది. ఇందులో రెండు ప్రభుత్వ హాస్టల్‌లు ఉన్నాయి. 350 మంది ఉంటున్న హాస్టల్‌కు గోపాల్ వార్డెన్‌గా ఉంటుండగా 250 మంది ఉంటున్న హాస్టల్‌కు నీలిమ వార్డెన్‌గా ఉంటున్నారు. అయితే దాడి జరిగిన సమయంలో ఇద్దరు వార్డెన్‌లు లేరు. దాడి తరువాత విషయం తెలుసుకున్న నీలిమ తీరిగ్గా హాస్టల్‌కు చేరుకున్నారు. కనీసం బాలుడికి వైద్య సేవలు అందించేందుకు కూడా ప్రభుత్వం తరపున ఎవరు అంతగా స్పందించలేదు. అయితే బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. బాలుడికి మెరుగైన వైద్య సహాయం కోసం కార్పొరేట్ ఆసుపత్రికి తరలించాలని బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధారావు డిమాండ్ చేశారు.