Home జాతీయ వార్తలు మార్చురీలో శవాన్ని పీక్కుతిన్న కుక్కల…

మార్చురీలో శవాన్ని పీక్కుతిన్న కుక్కల…

Dogs-eat-death-boady

అలీగఢ్: మార్చురీలో శవాన్ని కుక్కలు పీక్కు తిన్న ఘటన ఉత్తరప్రదేశ్ లోని అలిగఢ్ పట్టణంలో వెలుగుచూసింది. కుక్కలు శవాన్ని తిన్న దృశ్యాన్ని గుర్తు తెలియని వ్యక్తి వీడియో రికార్డు చేశాడు. అనంతరం సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. యుపిలో ఇలాంటి ఘటన రెండో సారి జరగటం గమనార్హం. ఈ విషయంపై అలీగఢ్ పట్టణ ఛీప్ మెడికల్ ఎంఎల్ అగర్వాల్ స్పందించారు. మార్చురీలో మృతదేహాన్ని కుక్కలు తిన్నట్టు తమకు సమాచారం వచ్చిందని చెప్పారు. ఇది అమానవీయ ఘటన ఆయన పేర్కొన్నారు. ఈ సంఘటనకు సంబంధించి పోస్టుమార్టం విభాగంలోని ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశామని చెప్పారు.