Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

పిల్లులకన్నా కుక్కలు ‘స్మార్ట్’

dog-smart-then-cat

కుక్కలను పెంచే యజమానులు లేదా పిల్లుల పెంపకం దారులు ఎవరికి వారే తమ పెంపుడు జంతువులు ఎంతో తెలివిగా నమ్మకంగా ఉంటాయని చెబుతుంటారు. కానీ శాస్త్రవేత్తలు పిల్లులు కన్నా, కుక్కలే ‘స్మార్ట్’గా ఉంటాయని నిర్ధారిస్తున్నారు. కుక్కల్లో 530 మిలియన్ న్యూరాన్లు ఉండగా, పిల్లుల్లో 250 మిలియన్ల న్యూరాన్లు ఉంటాయని, న్యూరాన్ల బట్టి వాటి ప్రవర్తన ఆధారపడి ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. అయితే పిల్లి యజమానులు దీన్ని అంగీకరించడం లేదు. కానీ అమెరికాకు చెందిన ఫిడో, రోవర్ జాతి కుక్కల మెదడులను పరిశీలించగా కుక్కలదే పై చేయి అని నిరూపణ అయ్యింది. ఈ సందర్భంగా హెర్కులానో- హౌజెల్ జంతువుల మేధాశక్తి పై మాట్లాడుతూ మెదడులోని కార్టెక్సు విభాగంలో న్యూరాన్ల సంఖ్య విశేషంగా ఉంటే ఆయా జంతువులు అతి తెలివిగా, చురుకుగా ప్రవర్తిస్తాయని పేర్కొన్నారు. పరిసరాల్లో ఏం జరగబోతోందో పసి గడతాయని చెప్పారు. కుక్కలకు పెద్ద మెదడు లేనప్పటికీ మిగతా మాంసాహార జంతువుల కన్నా, న్యూరాన్లు ఎక్కువ సంఖ్యలో కలిగి ఉంటాయని వివరించారు. గోధుమ రంగు ఎలుగుబంటికి పెద్ద మెదడు ఉన్నా పిల్లి మెదడులో ఎన్ని న్యూరాన్లు ఉంటాయో అంతే సంఖ్యలో ఎలుగుబంటిలో న్యూరాన్లు ఉంటాయాని ఈ సందర్భంగా ఉదహరించారు.

                                                                                                                      మన తెలంగాణ/ సైన్స్ విభాగం

Comments

comments