Home ఎడిటోరియల్ వాణిజ్య భుజకీర్తుల బండారం!

వాణిజ్య భుజకీర్తుల బండారం!

Doing-Business-2017జాతీయ స్థాయిలో అక్షరాస్యతలో  ఆంధ్ర ప్రదేశ్ 32 వ స్థానంలోనూ, తెలంగాణ 35 వ స్థానంలోనూ ఉండగా, తలసరి  ఉత్పత్తిలో తెలం గాణ 1,03,889 రూపాయలతో 13వ స్థానం లోనూ, ఆంధ్రప్రదేశ్  90517 రూపాయలతో 17 వ స్థానంలోనూ ఉన్నాయి.  వైద్య ఆరో గ్యసేవలు, తాగునీటి సరఫరా, పౌష్టికాహారం, ఇతర సామా జిక సమస్యల పరిష్కారంలో రెండు  తెలుగు రాష్ట్రాలు  జాతీయ స్థాయిలో ఎంతో వెనుకబడే ఉన్నాయి. 

ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఎక్కడ పెట్టుబడులు పెట్టి అతి సులువుగా లాభాలు దండుకోవచ్చో బడా పెట్టుబడిదారులకు సూచించేందుకు వీలుగా ప్రపంచబ్యాంకు అనుబంధ విభాగమైన ’డూయింగ్ బిజినెస్ ఆర్గనైజే షన్’ వారు ‘డూయింగ్ బిజి నెస్ -2017 : ఈక్వల్ ఆపర్చునిటీ ఫర్ ఆల్‘ శీర్షికతో 14వ వార్షిక మార్గదర్శక నివేదికను అక్టోబర్ చివరివారంలో (25వ తేదీ) విడుదల చేశారు. అక్షర క్రమంలో ఆఫ్గనిస్తాన్ నుంచి జింబాబ్వే వరకు ప్రపంచంలోని 190 దేశాల్లో ఈ ఏడాది జూన్ చివరి వరకు ఉన్నపరిస్థితులను పరిశీలించి నివేదిక తయారు చేశారు. అచ్చు ఇలాగే మనదేశంలో కూడా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ ప్రమోషన్ (డీఐపీపీ) వారు కూడా ఏ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేందుకు, సులువుగా వాణిజ్యం కొనసాగేందుకు వీలుగా నిబంధనల్లో మార్పులు జరిగాయో సూచించే విధంగా ‘బిజినెస్ రిఫారమ్స్ ఆక్షన్ ప్లాన్‘ పేరిట తయారు చేశారు. నిబంధనలను సరళీకరించడం ద్వారా అతిసులు వుగా వాణిజ్యం చేసుకోగలిగిన దేశాల్లో భారత దేశం గతంలో ఉన్న131 నుంచి ఇప్పుడు 130 వ స్థానానికి చేరుకోలిగింది. అయితే ఆ నివేదికలో భారతదేశంలోని రాష్ట్రాల వారీగా పరిశీలన లేనప్పటికీ ఢిల్లీ, ముంబై నగరాల ప్రామాణికంగా హైదరాబాద్, బెంగళూరు వంటి 17 నగరాల పరిస్థితిని అధ్యయనం చేసినట్టు పేర్కొంది. అందులో మొత్తం మీద లూథియానా పట్టణం అగ్రస్థానంలో ఉండగా హైదరా బాద్ రెండో స్థానంలో నిలిచింది. ముఖ్యంగా విద్యుత్ సరఫరా, భూసేకరణ, పన్నులవిధానం, అనుమతుల మంజూరు వంటి విషయాల్లో హైదరాబాద్ గణనీయ మైన గుణకాలు సాధించి తన పరిస్థితిని గతంలో కంటే ఎంతో మెరుగుపరుచుకుని స్వాతంత్య్రం వచ్చేనాటికే మహానగరాలుగా ఉన్నఢిల్లీ, ముంబై, కోలకతా, చెన్నైలను అధిగమించగలిగింది.

వాణిజ్యాన్ని ప్రభావితం చేసే 11 అంశాల్లో 10 అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నివేదికను ప్రపంచబ్యాంకు తయారు చేసింది. వాణిజ్యాన్ని ప్రారంభించడం, నిర్మాణ సందర్బంగా అవసరమైన అనుమతుల మంజూరు, విద్యుత్ సరఫరా, ఆస్తుల రిజిస్ట్రేషన్, వ్యాపారానికి అవసరమైన రుణ సదుపా యం, మైనారిటీ పెట్టుబడిదారుల రక్షణ, పన్నుల చెల్లింపు, సరిహద్దులు దాటి వాణిజ్య నిర్వహణ అవకాశాలు, ఒప్పందాల అమలు విషయంలో నిబద్ధ్దత, దివాళాతీసిన సందర్బంగా ఆస్తిఅప్పులకు సంబంధించిన లావాదేవీల పరిష్కారం వంటి అంశాలను ఈ నివేదిక తయారు సందర్బంగా అధ్య యనం చేశారు. వాణిజ్య నిర్వహణకు అవసరమైన విధంగా కార్మిక చట్టాల సవరణ అంశాన్ని మాత్రం ఈ నివేదిక పరిగణనలోకి తీసుకోలేదు. వాణిజ్య అవసరాల్లో కీలకమైన విద్యుత్ సరఫరా విషయంలో భారత దేశం 26వ స్థానంలో ఉండగా, మైనారిటీ వ్యాపారుల పరిరక్షణలో భారతదేశం 13వ స్థానంలో ఉంది. వ్యాపారం దివాలా తీసినప్పుడు ఆస్తి, అప్పుల పరిష్కారం విషయంలో 136 వ స్థానంలోనూ, ఆస్తుల రిజిస్ట్రేషన్ అంశంలో 138 వ స్థానంలోనూ, సరిహద్దులు దాటి వాణిజ్యానికి సహకరించడం లో 143 వ స్థానంలోనూ ఉన్నట్టు ప్రపంచ బ్యాంకు నివేదిక గుర్తించింది. పన్నుల చెల్లింపు, ఒప్పందాల అమలులో నిబద్ధత వంటి అంశాలలో మాత్రం భారత దేశం 172 వ స్థానంలో ఉంది.

అత్యంత సులువుగా వాణిజ్య నిర్వహణ సాధ్యపడే దేశాల జాబితాలో న్యూజిలాండ్ అగ్రస్థా నంలో ఉండగా ఆ తర్వాత సింగపూర్, డెన్మార్క్, హాంగ్ కాంగ్ (చైనా), రిపబ్లిక్ ఆఫ్ కొరియా, నార్వే, యూకే, యూఎస్‌ఏ, స్వీడన్ దేశాలున్నాయి. ఈ ఏడాది కాలంలో 137 దేశాలు నికి వాణిజ్యం సులువు గా సాగేందుకు వీలుగా నిబంధలను సడలించాయి. చాలాదేశాల్లో పన్నుల చెల్లింపు, హెచ్చుగా చెల్లించిన సొమ్మును వాపసు చేయడం, ఫిర్యాదుల పరిష్కాకా రానికి వీలుగా ‘ఆన్ లైన్‘ పద్దతులను ప్రవేశ పెట్టారు. బ్రూనై దారుస్సలాం, కజఖ్ స్తాన్, కెన్యా, బెలారస్, ఇండోనేషియా, సెర్బియా, జార్జియా, పాకిస్తాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహరేన్ దేశాల్లో గణనీయమైన స్థాయిలో వాణిజ్య నిబంధనలను సడలించారు. దాదాపు అన్ని దేశాల్లోనూ ఎంతోకొంత మేరకు వాణిజ్య నిబంధనలను సరళీకరించినప్పటికీ ఇందులో అగ్రస్థానంలో ఉన్న దేశాల్లో 96 శాతం యూరోప్, మధ్య ఆసియా దేశాలే కావడం విశేషం. కాగా భారత ప్రభుత్వం తయారు చేయించిన ‘బిజినెస్ రిఫారమ్స్ ఆక్షన్ ప్లాన్‘ ప్రకారం వివిభజన సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు సమానమైన గుణకాలతో ఒకటి, రెండు స్థానాలలో నిలవడం విశేషం. ఇక్కడ గమ్మత్తేమిటంటే విభజన ఫలితంగా తలసరి ఆదాయంతో సహా అనేక అంశాల్లో గణనీయమైన స్థాయిలో వెనక్కి నెట్టివేయబడ్డ ఆంధ్ర ప్రదేశ్ వాణిజ్య నిబంధనల సరళీకరణలో మాత్రం అగ్రస్థాయికి చేరుకోవడం.

అయితే కాపీ కొట్టినట్టు రెండు రాష్ట్రాలకు ఒకే గుణకాలు రావడం వెనుక ఏదో మతలబు ఉందని సామాన్యుడు సణిగేలోగానే సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే తనదైన శైలిలో అసలైన బాణం సంధించారు. అసలు ఈ గణకాల కేటాయింపు శాస్త్రీయత పైనే ఆయన సంశయం వ్యక్తం చేయడం అతి గొప్ప మలుపు. కేవలం ముంబై, ఢిల్లీ లేదా మరి కొన్నినగరాల్లో పరిస్థితులను బేరీజు వేసుకుని గణకాల కేటాయింపు అసంబద్దమని, నేరుగా రాష్ట్రస్థాయిలో పరిశీలన జరిపి మార్కులు కేటాయించడం సమంజసంగా ఉంటుందని సాక్షాత్తు ప్రధానమంత్రే ప్రపంచ బ్యాంకును కోరడం విశేషం. అయితే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితి మాత్రం తొలినుంచి అందుకు భిన్నంగా ఉంటూ వచ్చింది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్నప్పటికీ నిధుల కేటాయింపు సైతం నామమాత్రంగానే ఉండేది. ఏదైనా ప్రత్యేకంగా సాధించుకోవాలంటే ఉద్యమించక తప్పక పోవడం వల్లనే విశాఖ ఉక్కు కోసం యువకులు ప్రాణత్యాగం చేయవలసి రాగా సేలం ఉక్కుకర్మాగారం తమిళనాడుకు ఎంతో సులువుగా లభించడమే వివక్షకు చక్కని ఉదాహరణ. ఇందిరాగాంధీని గెలిపిం చినందుకు మెదక్ లో ఆర్డినెన్సు ఫ్యాక్టరీ 1984లో వచ్చింది తప్ప చాల సందర్భాల్లో తెలుగు ప్రాంతాల్లో ఏర్పాటు కావలసిన సంస్థలను ఇతర ప్రాంతాల నేతలు సులభంగా తరలించుకుపోతున్నా అడ్డుకునే దిక్కులేని పరిస్థితి ఆనాడు. జాతీయ స్థాయిలో రాజకీయాలో ఎన్‌టిఆర్, ఆతర్వాత చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించే రోజుల్లో కూడా రాష్ట్రానికి ప్రత్యేక ప్రయోజనాలు చేకూర్చి పెట్టలేకపోయారన్నది సత్యం. రెండున్నరేళ్లు గడిచినా ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశం ఒక కొలిక్కి రాకపోగా కేంద్రం తెలంగాణకు ఇస్తామన్నరాయితీల ఊసెత్తడం లేదు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ చేపడితే తెలంగాణాలో కూడా ఒక ప్రాజెక్ట్ ను జాతీయప్రాజెక్టు కింద పరిశీలిస్తామన్నది నీటి మూటగానే మిగిలిపోయింది. చట్టబద్ధత గురించి మాట్లాడేవాళ్లు నీతిఆయోగ్ అవతరణకు ముందే ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోవడం తమ అసమర్థ పాలనకు నిదర్శనమని అంగీకరించవలసి ఉంటుంది. జాతీయ స్థాయిలో అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్ 32 వ స్థానంలోనూ, తెలంగాణ 35 వ స్థానంలోనూ ఉండగా, తలసరి ఉత్పత్తిలో తెలంగాణ 1,03,889 రూపాయలతో 13వ స్థానంలోనూ, ఆంధ్ర ప్రదేశ్ 90517 రూపాయలతో 17 వ స్థానంలోనూ ఉన్నాయి. వైద్య ఆరోగ్యసేవలు, తాగునీటి సరఫరా, పౌష్టికాహారం, ఇతర సామాజిక సమస్యల పరిష్కారంలో రెండు తెలుగు రాష్ట్రాలు జాతీయ స్థాయిలో ఎంతో వెనుకబడే ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం తెలుగురాష్ట్రాల ప్రజలు తమకు కేంద్రం నేరుగా కల్పించే అదనపు అవకాశాలకోసం ఎదురు చూస్తూనే ఉంటారు. ఇలాంటి పరిస్థితిలో పారిశ్రామికవేత్తలు సులువుగా వ్యాపారం చేసుకోవడా నికి వీలుగా రాయితీలు కల్పించి, పాలనా సౌలభ్యం కల్పించినంత మాత్రాన తమకు ఒరిగేదేమిటని సామాన్యుడు ప్రశ్నిస్తూనే ఉంటాడు.

– కె.బి.రామ్మోహన్, 9346235072