Home ఎడిటోరియల్ తప్పుడు వాణిజ్య సౌలభ్యం ర్యాంకు!

తప్పుడు వాణిజ్య సౌలభ్యం ర్యాంకు!

edit

‘డూయింగ్ బిజినెస్ ఇన్‌డెక్స్’ వివాదాన్ని పరిశీలిస్తూ గత కొన్ని వారాలుగా నేను నా సహచరుడు దివ్యాన్షి వాధ్వా తో కలిసి రెండు వ్యాసాలను ప్రచురించాను. ఆ ఇండెక్స్ ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న వ్యాపారాన్ని నియంత్రించే చర్యలను అంచనా వేస్తుంది. మా మొదటి వ్యాసం చిలీ విషయాన్ని పరిశీలించింది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వ్యాపారం స్థాయిని లెక్కించడంలో ప్రపంచబ్యాంక్ అనుసరిస్తున్న పద్ధతుల మూలంగా చిలీ బ్యాంక్ మైఖేల్ బ్యాచిలెట్ సారథ్యంలోని సోషలిస్టు ప్రభుత్వ హయాంలో వ్యాపారం స్థాయి పడిపోయినట్లు బ్యాంకు ప్రధాన ఆర్థికవేత్త పాల్ రోమర్స్ గత జనవరిలో ప్రకటించారు. ఆ తరువాత ఆమె స్థానంలో స్థానంలో వచ్చిన మరో నేత హయాంలో కొంచెం పుంజుకున్న వ్యాపారం స్థాయి తిరిగి బ్యాచిలెట్ అధికారంలోకి వచ్చాక పడిపోయినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఆరోపణ చేసిన తర్వాత రోమర్ రాజీనామా చేశారు. కుట్ర సూత్రాలను పక్కనబెడుతూ మా విశ్లేషణ సాగింది. ఆ సమాచారాన్ని, సంకేతాన్ని మేము విడుదలచేశాము కూడా. మా విశ్లేషణలో ఖరారైన విషయం ఏమిటంటే ఇలా తేడాపాడాలు వ్యాపారస్థాయిలో సాధారణ పద్ధతిలో అంచనా వేసినప్పటికంటే వేరే పద్ధతిలో చూసినప్పుడు ఎక్కువగా ఉంటున్నాయని, మా రెండవ వ్యాసం భారతదేశంపై ప్రకటించిన ర్యాంకింగ్‌లను ప్రశ్నించింది. ప్రపంచ వ్యాపార ర్యాంకింగ్‌లలో భారతదేశం స్థానం 190 దేశాలకూ 2017లోని 130వ స్థానంనుంచి 2018లో 100కు ఎగబాకడమనే సందర్భాన్ని నరేంద్రమోడీ ప్రభుత్వం పండగ చేసుకుంది. ర్యాంకింగ్‌లను లెక్కించే పద్ధతిని సాధ్యమైనంత వరకు మార్చకుండా కొనసాగిస్తే ప్రపంచబ్యాంక్ తాజా రేటింగ్(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో హఠాత్తుగా కనపడిన మెరుగుదల సాధారణమని అనిపిస్తుంది.
గత వారం ‘గ్లోబల్ డెవలప్‌మెంట్ సెంటర్’ మా విశ్లేషణకు సమాధానంగా ఒక వ్యాసాన్ని ప్రచురించింది. ప్రపంచబ్యాంకులోని అభివృద్ధి, ఆర్థిక వ్యవహారాల సీనియర్ డైరెక్టర్ శాంతా దేవరాజన్ ఆ వ్యాసాన్ని రాశారు. మా విశ్లేషణ ఉపయోగకరం కాదని ఆయన తేల్చారు.1. ర్యాంకింగ్స్ సాపేక్షం కనుక ఇతరుల చర్యలవల్ల అవి మారుతాయి. 2. పద్ధతి ప్రకారం వచ్చే మార్పులు మెరుగైనవి. పొరపాట్లు కావు.3. భారతదేశం నిఖార్సుగా సంస్కరణలు అమలు పరిచింది. ఈ మూడు పాయింట్లను నేను అంగీకరిస్తాను. కాబట్టి ‘వ్యాపారం చేయడంపై తప్పుడు విమర్శ’ శీర్షికతో దేవరాజన్ ప్రచురించిన స్పందన మా వాదన తప్పు అని నిరూపించటం లేదు. మేము ఇంతకుముందు చేసిన ‘డూయింగ్ బిజినెస్’లో చెప్పుకోదగ్గ తప్పుల అంశాన్ని దేవరాజన్ స్పందన దాటవేసింది. ప్రపంచబ్యాంక్ సీనియర్ సిబ్బంది ‘డూయింగ్ బిజినెస్’ ను సమర్థించాలనే ఒత్తిడిని భారత్‌నుంచి ఎదుర్కొంది. ప్రపంచబ్యాంకులోని భారతదేశ వ్యవహారాల డైరెక్టర్ జునాయిద్ అహ్మద్ ప్రధాన ఖాతాదారైన ప్రభుత్వంతో మంచి సంబంధాలు కలిగి ఉండాలని ఆత్రపడ్డారు. కానీ ఆయన తన ప్రకటనలో చేసిన అనేక సూచనలు తప్పుదోవ పట్టించేవిగా ఉన్నా యి. ప్రభుత్వ విధాన మార్పుల వల్ల క్షేత్రస్థాయిలో సత్ఫలితాలు కనపడినట్లు చేసిన ప్రకటనకు ఆయా కంపెనీలు అందించిన సమాచారమే పునాది. వాటి వ్యాపారం స్థాయిపై వచ్చిన పరిశీలక నివేదికలను కాకుండా ఆయా చిన్న, పెద్ద కంపెనీలు అందించిన సమాచారం ఆధారంగానే ర్యాంకింగ్ పెరిగినట్లు అంచనా వేయడం తప్పు. సాధారణంగా నిపుణులు, న్యాయవాదులు, యాజమాన్య వ్యవహారాల కన్సల్టెంట్‌లు అటువంటి అధ్యయనాలు జరిపి నివేదికలు ఇస్తారు. ఆ బృందంలో ప్రభుత్వాధికారులు కూడా ఉంటారు. ఆయా పరిశీలక బృందాలకు వాస్తవాలు రిపోర్టు చేయకుండా, వ్యాపారంలో అడ్డువస్తున్న కఠిన నియమాల గురించి నివేదికలో రాయాలని సాధారణంగా కంపెనీలు అడగడం జరుగుతుంది. 2017 నాటి ‘ఈజ్ ఇన్ డూయింగ్ బిజినెస్’ ర్యాంకింగ్ నివేదిక అందుకు సంబంధించిన వెబ్‌సైట్ సమాచారాన్ని ఆధారం చేసుకోలేదు. ఆ సమాచారం ఇప్పటికీ ఆ వెబ్‌సైట్‌లో ఉంది. అందులో 213వ పేజీ చూస్తే భారతదేశం ర్యాంకు 55.27 స్కోరుతో 130వ స్థానంలో ఉన్నట్లు తేలుతుంది. అందుచేత బ్యాంకు పద్ధతులను మార్చి తాజా ర్యాంకులను నిర్ణయించినట్లు చెప్పదలచుకున్నాం. అందుచేత భారతదేశం సులభంగా వ్యాపారం చేయడంలో తన ర్యాంకును 30మెట్లు హఠాత్తుగా పెంచుకుందన్న ప్రపంచబ్యాంకు వాదన సరికాదని తేలుతోంది. ఎందుకంటే అందు కు ఆధారం చేసుకున్న సమాచారం ఆ కంపెనీలు అందించినవే కనుక.
ప్రపంచబ్యాంక్ వెబ్‌సైట్‌లో సవరించిన సమాచారం ప్రకారం ర్యాంకింగ్స్‌లో తిరిగిమార్పులు చోటుచేసుకున్నాయి. ర్యాంకులను లెక్కించే పద్ధతిలో ఇటీవల అనుసరించిన మార్పులే భారతదేశం తాజా ర్యాంకుకు కారణం. భారతదేశం 2018లో ఎగబాకిన 30 పాయింట్లలో ఏడు పాయింట్లు లెక్కింపు పద్ధతిలో తప్పులవల్ల వచ్చినవే అని ఇప్పుడు వెబ్‌సైట్ తాజా సమాచారం ప్రకారం తెలుస్తోంది. 2017 మధ్యలో భారతదేశానికి సంబంధించిన సమాచారాన్ని ప్రపంచ బ్యాంకు సవరించింది. 2017 డిసెంబర్ పత్రికా ప్రకటనలో తప్పుడు అంకెలుగా భావించిన వాటినే తిరిగి వాడడం జరిగింది. అయితే ఆ వ్యత్యాసం ఉందన్న సంగతిని ఇప్పుడు ప్రపంచబ్యాంకు నిరాకరిస్తోంది. క్షేత్రస్థాయి వాస్తవానికి ఈ ర్యాంకింగ్ చాలా దూరమన్న సంగతిని మనలో చాలామంది మరిచిపోయారు. ‘డూయింగ్ బిజినెస్’ ర్యాంకింగ్స్‌లో భారత్ మెరుగుదల’ అనే శీర్షికతో దేశంలోని ప్రపంచబ్యాంక్ శాఖ అక్టోబరు 31న విడుదల చేసిన ప్రకటనకు ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణలు ఆధారం. ఆ ప్రకటన మొదటిపేరాలోనే భారత్ 30మెట్లు ఎగబాకి 130వ స్థానంనుంచి 100వ స్థానానికి చేరుకుందని ప్రకటించారు. అయితే ఈ ర్యాంకింగ్‌కు మూలమైన స్కోరుకు ప్రకటనలో తగినంత ప్రాధాన్యం ఇవ్వలేదు.క్షేత్రస్థాయి వాస్తవానికి ప్రపంచబ్యాంకు ప్రకటన ఎంతదూరమో ఈ స్కోరును బట్టే తెలుస్తుంది.
మార్కెటింగ్ విజయాలకు ర్యాంకింగ్‌లు కీలకం. భారత్, చిలీ దేశాల విషయంలో ప్రపంచభ్యాంక్ మార్కెటింగ్‌కే ప్రాముఖ్యమిస్తూ, అసలు లక్షాలను విస్మరించిట్లు అర్థమౌతుంది. ర్యాంకింగ్ నిర్ణయానికి ఆధారమైన సమాచారంలో తప్పిదాలున్నట్లు, దురుద్దేశంతో ఆ సమాచారం అందించినట్లు సాధారణ ప్రజలు నమ్మరు. అది నిరూపించడానికి ఆధారాలు నేరుగా సమర్పించలేము. ఈ విషయంలో వస్తున్న ఆరోపణలను ఏ మాత్రం లక్షపెట్టకుండా బుట్టదాఖలా చేస్తుందని మా పోస్టులకు ప్రపంచబ్యాంకు ప్రతిస్పందన వల్ల స్పష్టమౌతోంది. తాము ఎంతో నాణ్యమైన సమాచారం అందిస్తామని గొప్పలకు పోయే ప్రపంచసంస్థకు ఆ తీరు ఏ మాత్రం మంచిదికాదు. ఎందుకంటే ఆ సమాచారం ప్రపంచ దేశాలు అనుసరిస్తున్న అభివృద్ధి విధానాలకు సంబంధించినది కాబట్టి. ప్రపంచబ్యాంకు ర్యాంకింగ్‌లను లెక్కకట్టడానికి సొంతంగా పరిశీలన జరిపించి, ఆ సమాచారాన్ని ఆధారం చేసుకోవాలి. అలా కాకుండా కంపెనీలందించే సమాచారం ఆధారంగానే దేశానికి ర్యాంకింగ్‌ను నిర్ణయించడం సవ్యం కాదని నిపుణులు విమర్శిస్తున్నారు.
* శామ్ పన్‌తకి