Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

అమ్మకాల ఒత్తిడితో నష్టాలు

Domestic Stock Market Closed With Huge Loss

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిశాయి. ఫైనాన్స్, ఫార్మా, ప్రైవేట్‌రంగ బ్యాంక్, ఆటో షేర్ల పతనంతో నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 61 పాయింట్ల కోల్పోయి 34,951 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 25 పాయింట్ల నష్టపోయి 10,528 వద్ద స్థిరపడింది. ప్రభుత్వరంగ బ్యాంకులకు రెండో విడత మూలధన నిధి రూ.54 వేల కోట్లు అందించేందుకు కేంద్రం సిద్ధమైందనే వార్తలతో పిఎస్‌యు బ్యాంక్ ఇండెక్స్ అత్యధికంగా 3.30 శాతం లాభపడింది. ఎన్‌ఎస్‌ఇలోని ప్రభుత్వరంగబ్యాంక్, రియల్టీ, మెటల్, ఐటీ రంగాలకు చెంది సూచీలు లాభాల్లో ముగిశాయి. మరోవైపు ఫైనాన్స్, ఫార్మా, ప్రైవేట్ రంగ బ్యాంక్, ఆటో రం గాలకు చెందిన సూచీలు నష్టాల్లో ముగిశాయి.

ఉదయం సెన్సెక్స్ సూచీ 107 పాయింట్ల లాభం తో ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులతో సూచీలు దిగువ ముఖం గా పయనించాయి. అదే సమయంలో డాలర్ మా రకంలో రూపాయి బలహీనత తదితర కారణాల తో సూచీలు క్షణాల్లో నష్టాల్లోకి మళ్లాయి. ఎస్‌బిఐ ప్రకటించిన ఫలితాలను మార్కెట్ వర్గాలను మె ప్పించడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఫలితంగా సూచీలు తమ నష్టాలను తగ్గించుకోగలిగాయి. ప్రధానంగా బిపిసిఎల్, ఇం డస్‌ఇండ్, ఇండియాబుల్ హౌసింగ్, ఐఒసి,షేర్లు నష్టపోయాయి. హెచ్‌సిఎల్ టెక్, విప్రో, యాక్సిస్ బ్యాంక్, యుపిఎల్, ఎస్‌బిఐ షేర్లు లాభపడ్డాయి.

Domestic Stock Market Closed With Huge Loss

Telangana Latest News

Comments

comments