Search
Saturday 17 November 2018
  • :
  • :

మార్కెట్ రూపాయి దెబ్బ

Domestic stock markets lost the second day
224 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
న్యూఢిల్లీ: దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ భారీగా పడిపోవడం మార్కెట్‌పైనా తీవ్ర ప్రభావం చూపింది. అంతర్జాతీయంగా టర్కీ ఆర్థిక సంక్షోభంతో రూపాయి పతనం బాట పట్టగా, దేశీయ సూచీలు కూడా బలహీనపడ్డాయి. మార్కెట్‌ముగిసే సమయానికి సెన్సెక్స్ 224 పాయింట్ల నష్టపోయి 37,645 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 74 పాయిం ట్లు నష్టపోయి 11,3 56 ల వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్, ఫైనా న్స్, అటో, మెటల్ రంగాలకు చెందిన షేర్లు నష్టపోయాయి.

రూపాయి జీవితకాల కనిష్ట స్థాయికి పతనంతో ఐటీ, ఫార్మా రంగ షేర్లు లాభపడ్డాయి. బ్యాంకు నిఫ్టీ 1.20 శాతం నష్టపోయి 28వేల దిగువన 27,794 వద్ద ముగిసింది. ఓ దశలో సెన్సెక్స్ 37,559 నుంచి- 37,799 పాయింట్ల మధ్య కదలాడింది. నిఫ్టీ సూచీ 11,340 – 11,406 మధ్య ట్రేడైంది. మార్కెట్ ప్రారంభ సమయానికి ఆసియా మార్కెట్లు నష్టాల ట్రేడింగ్ ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని మరింత దెబ్బతీసింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఆటో రంగ షేర్లలో అమ్మకాలతో సూచీలు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. మార్కెట్ మిడ్ సెషన్ నుంచి ఐటి, ఫా ర్మా షేర్ల ర్యాలీ సూచీలకు కొంత ఊరటనిచ్చింది. ప్రధానంగా ఐఒసి, వేదాంత, యస్ బ్యాంక్, హెచ్‌పిసిఎల్, బిపిసిఎల్ షేర్లు 3-6 శాతం వరకూ నష్టపోయాయి. హెచ్‌పిసిఎల్ టెక్, గ్రాసిం, సన్‌ఫార్మా, టెక్ మహీంద్రా, గెయిల్ షేర్లు 2 నుంచి 3 శాతం లాభపడ్డాయి.

Comments

comments