Home అంతర్జాతీయ వార్తలు మీడియాపై మండిపడిన ట్రంప్

మీడియాపై మండిపడిన ట్రంప్

America : Donald Trump Comments on America Media

న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆ దేశ మీడియాపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అమెరికా జర్నలిస్టులకు దేశభక్తి లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ దేశ మీడియా ప్రజల విశ్వసనీయత కోల్పోయిందని ఆయన పేర్కొన్నారు. వార్తలను బాధ్యతాయుతంగా రిపోర్టు చేయడం మాత్రమే పత్రికా స్వేచ్ఛ అని ఆయన తెలిపారు. ఇటీవల ఆయన న్యూయార్క్ టైమ్స్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాపై విరుచుకపడుతున్నారు. తమ ప్రభుత్వంపై మీడియా 90 శాతం తప్పుడు ప్రచారం చేస్తుందని ఆయన దుయ్యబట్టారు. తామెంత సానుకూలంగా ఉన్నా, మీడియాకు మాత్రం తమపై సానుకూల అభిప్రాయం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్టు తదితర పత్రికలు తమ గురించి తప్పుడు వార్తలు రాస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. తమకు మీడియా సహకరించకున్నా, ప్రజలు తమ వైపే ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికైనా మీడియా తమ వైఖరిని మార్చుకుని, దేశాభివృద్ధిలో పాలు పంచుకోవాలని ఆయన హితవు పలికారు.

Donald Trump Comments on America Media