Home అంతర్జాతీయ వార్తలు ట్రంప్‌ను సతాయించిన గొడుగు..!(వీడియో)

ట్రంప్‌ను సతాయించిన గొడుగు..!(వీడియో)

Donald Trump with Umbrella

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన ఏ వార్త బయటికి వచ్చినా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా ఆయనకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. సోమవారం ఆయన ఇల్లినాయిస్‌లో జరుగుతున్న ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు విమానంలో బయల్దేరారు. ఆ సమయంలో వర్షం కురుస్తుండటంతో ఆయన గొడుగు పట్టుకుని విమానం ఎక్కారు. అయితే విమానం లోపలికి వెళ్లే  సమయంలో గొడుగును మూసేందుకు సాధ్యం కాకపోవడంతో, ద్వారం వద్దే దాన్ని వదిలేసి ట్రంప్ లోపలికి వెళ్లిపోయారు. దాంతో గాలికి ఆ గొడుగు అటూ ఇటూ ఊగుతూ విమాన ద్వారం వద్దే ఉండిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు.

ఈ వీడియోపై నెటిజన్స్ చేసిన కొన్ని కామెంట్లు: “ట్రంప్‌కు గొడుగును ఎలా మూసివేయాలో కూడా తెలీదు”, “చేతిలో ఉన్న గొడుగునే మూయలేదంటే బాత్ రూమ్‌కు వెళితే ఫ్లష్‌ కూడా చేయరేమో”, “ట్రంప్‌ తెల్లగా ఉంటారు. గొడుగు నల్లగా ఉంది కాబట్టే, ఆయన అందుకే పట్టించుకోకుండా వదిలేసుంటారు” అని కామెంట్లు చేశారు.

గతంలోనూ ట్రంప్ మిన్నియా పోలిస్  సెయింట్ పాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ఎక్కుతున్నప్పుడు ఆయన ఎడమ కాలి బూటుకు టాయిలెట్ పేపర్ లాంటిది ఏదో అతుక్కుంది. విమానం మెట్లు ఎక్కుతున్నప్పుడు అది స్పష్టంగా కనిపించింది. దాంతో అక్కడి ఫొటోగ్రాఫర్లు దాన్ని వీడియో తీశారు. అయితే విమానం మెట్లు పూర్తిగా ఎక్కేలోగానే అది పడిపోయింది. కాలికి ఏదో అతుక్కున్నా ట్రంప్ దాన్ని గమనించకపోవడం గమనార్హం. ఈ వీడియో కూడా అప్పడు వైరల్ అయింది.

Donald Trump does not knows how to close an Umbrella

Telangana Breaking News