Search
Monday 24 September 2018
  • :
  • :

ముగిసిన ట్రంప్-కిమ్ భేటీ

Donald Trump Meet with Kim in Singapore

సింగపూర్: మంగళవారం ఉదయం అమెరికా, ఉత్తర కొరియా అధ్యక్షుల భేటీ ముగిసింది. సెంటోసా ద్వీపంలోని కెపెల్లా హోటల్‌లో డోనాల్డ్ ట్రంప్, కిమ్ జోంగ్ ఉన్ సమావేశమయ్యారు. పలు ప్రపంచ దేశాల ఒత్తిడితో ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి. అణ్వాయుధాల విషయంలో 48 నిమిషాల పాటు ట్రంప్-కిమ్ చర్చలు జరిపారు. ఉత్తర కొరియాను అణ్వాయుధాలను వీడాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. అణునిరాయుధీకరణకు అంగీకరిస్తే ఉత్తర కోరియా భద్రతకు హామీ ఇస్తామని అమెరికా స్పష్టం చేసింది. ఉత్తర కొరియాకు భద్రతా హామీతో పాటు ఆర్థిక సాయం అందించే అవకాశం ఇస్తామని అమెరికా హామీ ఇచ్చింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ నిర్ణయంపై అందిరి చూపు ఉంది. ట్రంప్-కిమ్ భేటీకి సింగపూర్ ప్రభుత్వం భారీ భద్రత ఏర్పాట్లు చేసింది. కిమ్‌తో భేటీ పూర్తిస్థాయిలో విజయవంతమవుతుందని భావిస్తున్నామని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నో అడ్డంకుల తరువాత సింగపూర్ భేటీ సాకారమైందని కిమ్ తెలిపారు.

Comments

comments