Search
Sunday 23 September 2018
  • :
  • :

అగ్రరాజ్యం అధ్యక్షుడి ఆట.. వద్దంటే మారాం..!

Donald Trump Play

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష పదవంటే ప్రపంచంలోనే అత్యున్నత హోదాల్లో ఒకటి. అయితే డోనాల్డ్ ట్రంప్ ఆ పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏదో విధంగా విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఆయన పాటిస్తున్న విధానాలపై తీవ్ర స్థాయిలో ప్రజల్లో అసంతృత్తి వస్తుంది. ఆయన ట్రంప్ తన తీరు మార్చుకోవడం లేదు. తన ఏదైతే అనుకుంటున్నాడో… అదే చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో ట్రంప్ చేష్టలు కూడా అందరికి ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. తాజాగా పోప్ ఫ్రాన్సిస్‌ని కలిసినప్పుడు ట్రంప్ చేసిన పని ఎంత వైరలయిందో తెలిసిందే. అయితే తాజాగా ట్రంప్‌కి సంబంధించిన ఓ వీడియో సంచలనంగా మారింది.

చిన్న పిల్లాలు ఆటాడుతుండగా అడ్డుకుంటే ఎంత గోల చేస్తారో చెప్పనక్కర్లేదు… అరుస్తారో.. చేతికందిన వస్తువులు విసిరేస్తారా.. ఒకటా రెండా.. నానా రాద్ధాంతం చేస్తారు. అయితే డోనాల్డ్ అచ్చం ఇలా ప్రవర్తిస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. అయితే అందులో ఉంది నిజంగా ట్రంప్‌కాదు అయన డూప్. ట్రంప్ పిల్లలతో కలిసి గంతులెయ్యడం, ఉపాధ్యక్షుడు మైక్‌ పేన్స్‌(డూప్‌) వద్దని వారించడం.. ఎంతకీ వినని ట్రంప్‌ నేలపై గిలగిలా తన్నుకోవడం ఈ వీడియోలో మనం చూడోచ్చు.. మీరు కూడా ట్రంప్ (డూప్) అల్లరి వేషాలు చూసి కాసేపు నవ్వుకోండి…

Comments

comments