Home అంతర్జాతీయ వార్తలు నన్ను అభిశంసిస్తే అమెరికా పతనమే..!

నన్ను అభిశంసిస్తే అమెరికా పతనమే..!

అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక

Delhi : US President Donald Trump Come to India on August 15th

వాషింగ్టన్ : తనను అభిశంసించడం జరిగితే అమెరికా ఆర్థిక వ్యవస్థ పతనం అవుతుందని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. గురువారం ఒక ఇంట ర్వూలో ఆయన మాట్లాడారు. ఒక్క విషయం తాను స్పష్టం చేస్తున్నానని, తనను అభిశంసించడం అంటూ జరి గితే, మార్కెట్ దెబ్బతీంటుందని, ప్రజలంతా పేదలు అవు తారని చెప్పారు. అమెరికా న్యాయస్థానాల నుంచి ట్రంప్ పలు వ్యాజ్యాలు ఎదుర్కొవడం, కోర్టులో ట్రంప్ మాజీ అటార్నీ మైకెల్ కొహెన్ ట్రంప్‌నకు వ్యతిరేకంగా ఆరోపణ లకు దిగడం, అమెరికా ప్రచారం సమయంలో ఆర్థిక చట్టాలను కూడా ఉల్లంఘించే రీతిలో వాగ్దానాలకు దిగా లని సంకల్పించినట్లు వెల్లడించడం వంటి అంశాలను విలే కరులు ప్రస్తావించారు. తాను అధికారంలోకి వచ్చిన తరు వాత గణనీయంగా ఉద్యోగాల కల్పన జరిగిందని, ఆర్థిక పురోగతి కూడా సాధించామని, హిల్లరీ క్లింటన్ అధికారం లోకి వచ్చి ఉంటే అమెరికన్లు పతనావస్థకు చేరి ఉండేవా రని తెలిపారు. అంతా బాగా పనిచేసే వారిని అభిశంసిస్తా రని ఏ విధంగా అనుకుంటారు? అని ప్రశ్నించారు.

కోహెన్ చెప్పినవన్నీ అబద్ధాలే

ట్రంప్ న్యాయవాదిగా ఎంతోకాలం పనిచేసిన మైఖేల్ కోహెన్, 2016 అధ్యక్ష ఎన్నికల కన్నా ముందు అక్రమం గా కొందరికి డబ్బులు చెల్లించానని కోహెన్ చెప్పినవన్నీ కట్టు కథలేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నా రు. తాను ఏ తప్పూ చేయలేదని ట్రంప్ చెప్పారు. ట్రంప్ మాజీ న్యాయవాది కోర్టులో చెప్పిన మాటలు ట్రంప్‌కు చట్టపరంగా ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉందని, తదుపరి వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో ఆయన పోటీ చేయడా నికి అడ్డంకిగా మారే ప్రమాదముందని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ట్రంప్ అధ్యక్ష భవనంలో అడుగుపెట్టి న తరువాత ఎదురైన అతి పెద్ద చేదు అనుభవం ఇదే. ట్రంప్‌తో ఉన్న లైంగిక సంబంధాలను బయటపెట్టకుండా ఉండేందుకు అశ్లీల చిత్రాల నటికి డబ్బు చెల్లించినట్లు కోహెన్ ఫెడరల్ కోర్టులో ఒప్పుకున్నారు. ఇద్దరు మహిళల తో ట్రంప్ సాగించిన శారీరక సంబంధాల వివరాలను బయటపెట్టకుండా ఉండేందుకు ఆ ఇద్దరు మహిళలకు డబ్బులు చెల్లించి మౌనం వహించేలా చేశానని కూడా ఆయన అంగీకరించారు. ఇది తన బాస్ ట్రంప్ సలహా తోనే చేశానని కోర్టుకు తెలిపారు. ట్రంప్ ఎన్నికల ప్రచార చైర్మన్ పాల్ మానఫోర్ట్‌పై పన్ను ఎగవేత, బ్యాంకుకు తప్పుడు వివరాలు ఇచ్చి మోసగించిన కేసు, ఎన్నికల ప్రచార సమయంలో నిబంధనలకు విరుద్ధంగా డబ్బలు చెల్లించిన కేసు విచారణ సమయంలో ట్రంప్ మాజీ న్యాయవాది కోహెన్ ఈ విషయాలు బయటపెట్టారు.

2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో రష్యా జోక్యంపై దర్యాప్తు చేస్తున్న ఎఫ్‌బిఐ ట్రయల్ కోర్టుకు పంపిన కేసులో పాల్ మానఫోర్ట్ అక్రమాలు బయటపడ్డా యి. ఈ సందర్భంగా పాల్ న్యాయవాది కోహెన్ ఈ నేరా లు జరిగాయని కోర్టులో అంగీకరించారు. అయితే కోహె న్ చెప్పినవన్నీ కథలని ముందుగా చెప్పిన ట్రంప్, ఆ తరువాత కోహెన్ చేసింది నేరం కాదని అన్నారు. ఫాక్స్ అండ్ ఫ్రెండ్స్‌కు ఇచ్చిన ఇంటర్వూలో అవి ఎన్నికల నింబంధనలను ఉల్లంఘించినవి కావని ఆయన అన్నారు. మహిళలకు ఇచ్చిన డబ్బులు కోహెన్‌వని, వారితో కోహెన్ కు సంబంధాలు ఉండేవని ట్రంప్ చెప్పారు. రియల్ ఎస్టే ట్ దిగ్గజంగా పేరుగాంచిన ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత, కోహెన్ కోర్టులో చెప్పిన విషయాలు ఆయనకు తలనొప్పిగా మారాయి. ఇంకా ముందుముందు ఎన్ని వివరాలు బయటపడతాయో, ట్రంప్‌కు చట్టం ఏ విధంగా చుట్టుకుంటుందో అనేది తేటతెల్లం కాలేదు.