Home అంతర్జాతీయ వార్తలు కవ్విస్తే ఇక ఇరాన్ ఉండదు : ట్రంప్

కవ్విస్తే ఇక ఇరాన్ ఉండదు : ట్రంప్

Donald Trump Says Iran Making A Very Bad Mistake

 

వాషింగ్టన్ : అమెరికాపై దాడికి దిగిన క్షణంలోనే ఇరాన్ అధికారిక అంతం ఖాయం అవుతుందని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఇరాన్ అమెరికా ప్రయోజనాలు ఏ విధంగా అయినా దెబ్బతీయాలని చూసినా ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఇరాన్ అంతం ఇరాన్ చేతల్లోనే ఉందని, ఈ విషయాన్ని అక్కడి పాలకులు గుర్తుంచుకుంటే మంచిదని తెలిపారు. ఇప్పటికి ఇరాన్ తమను కవ్వించేందుకు, తలపడేందుకు యత్నిస్తూ ఉంటే, ఇక ముందు బెదిరింపులకు దిగేందుకు ఇరాన్ అనేది ఉండదని ఆయన అత్యంత కటుతర పదజాలంలో యుద్ధ సంకేతాలు వెలువరించారు. ఇరాన్ తన అణుపాటవ శక్తి పరీక్షలను వెంటనే నిలిపి వేయాలని, ఇంధన విషయంలో అమెరికా ప్రయోజనాలను దెబ్బతీయడం కానీ, తమ పౌరులకు కానీ, దౌత్య సిబ్బందికి కానీ ఏమైనా అపకారం తలపెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్‌ను అమెరికా హెచ్చరిస్తూ వస్తోంది. ఇటీవలే ఇరాన్ సమీపానికి అమెరికా వాహక నౌకలు , బి 52 బాంబర్లను తరలించారు. దీనితో గల్ఫ్‌లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఓ వైపు ఇరాన్‌పై ట్రంప్ తీవ్రస్థాయిలో స్పందిస్తూ ట్వీట్లు వెలువరిస్తున్నప్పటికీ వైట్‌హౌస్ వర్గాలు ఇటీవలి కాలంలో ఇరాన్ చర్యలు ఇతర పరిణామాలపై వివిధ స్ధాయిలో ప్రకటనలు వెలువరిస్తూ వస్తున్నాయి. ఇరాన్ విషయంలో ఏ విధంగా స్పందించాలనే అంశంపై ట్రంప్ కేబినెట్‌లో తీవ్రస్థాయి విభేదాలు ఉన్నట్లు, అందుకే ఇరాన్‌పై స్పష్టమైన అధికారిక ప్రకటనలు వెలువడటం లేదని అమెరికా పత్రికలు విశ్లేషించాయి.

Donald Trump Says Iran Making A Very Bad Mistake