Home పెద్దపల్లి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడండి

రక్తదానం చేసి ప్రాణాలు కాపాడండి

Donate blood and save your life

ఎంఎల్‌ఎ దాసరి మనోహర్‌రెడ్డి

మనతెలంగాణ/పెద్దపల్లి: రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడాలని పెద్దప ల్లి ఎంఎల్‌ఎ దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కలెక్టర్ కార్యాలయం నుంచి ఐబి గెస్ట్‌హౌస్ వరకు నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభిచారు.ఈ సందర్బంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ రక్తదా నం చేయడం అన్ని దానాల్లోకన్నా గొప్ప విషయమని ప్రజలు రక్తదానం చేసేందుకు స్వచ్చందగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.మనిషి తన జీవితకాలంలో ఎన్ని సార్లయిన ర క్తాన్ని దానం చేయవచ్చని రక్తదానం చేయడం వల్ల ఎల్లప్పుడు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటార ని సైన్స్ చెబుతోందని పేర్కొన్నారు. రక్తదానం పట్ల ప్రజలలో ఉన్న అపోహలను తొలగించేందుకు వైద్య ఆరోగ్య సంస్థ క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కా ర్యక్రమంలో టీబి ప్రోగ్రాం అధికారి పి మధుకర్ రెడ్డి,జిల్లా ఉప వైద్యాదికారి అబ్దుల్ బాబా జి ల్లా వైద్యాధికారులు,ఆరోగ్య కార్యకర్తలు,ఆశా వర్కర్లు,తదితరులు పాల్గొన్నారు.