Search
Wednesday 14 November 2018
  • :
  • :

చిన్నారి వరుణిక వితరణ

ktr1

మంత్రి కెటిఆర్‌ను కలిసి సిఎం సహాయ నిధికి లక్ష రూపాయల విరాళం 

మన తెలంగాణ / హైదరాబాద్ : అమ్మ పాలం త స్వచ్ఛమైనవి చిన్న పిల్లల మనసులు అంటా రు. కల్మషం లేని ఆ పసి హృదయాల్లో ఎదుటి వారికి చేతనైనంత సహాయం చేయాలన్న ఆలోచనలే ఉంటాయి. హైదరాబాద్‌లో చదువుకుంటున్న పదేళ్ల వరుణిక కూడా అలాంటిదే. ఎవ రు ఎంతటి ఆపదలో ఉన్నా నేనున్నానంటూ ముందుకొచ్చి సహాయం చేసే రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటి. రామారావు అంటే వరుణికకు ప్రత్యేక అభిమానం. కెటిఆర్ చేస్తున్న మంచి పనుల గురించి మీడియాలో వచ్చే వార్తలను క్రమం తప్పకుండా చూస్తున్న వరుణిక తాను కూడా చేతనైనంత సహాయం చేయాలనుకుంది. ఇదే విషయాన్ని తన తండ్రి గడ్డంపల్లి రవీందర్ రెడ్డికి తెలిపింది. ఈసారి తన పుట్టిన రోజు పార్టీ కి బదులుగా అందుకు ఖర్చయ్యే డబ్బులను కెటిఆర్ అంకుల్‌కు అందజేయాలని కోరింది. తన పుట్టినరోజుకు తండ్రి ఖర్చు చేయాలనుకున్న లక్ష రూపాయలు పది మందికి ఉపయోగించాలనుకుంది. ఇదే విషయాన్ని తండ్రి రవీందర్‌రెడ్డికి ఆ పాప తెలిపింది. చిన్న వయస్సులోనే తన కూతురు పెద్ద మనసును అర్థం చేసుకున్న రవీందర్‌రెడ్డి వరుణికను మనస్ఫూర్తిగా అభినందించారు. వరుణికతో కలిసి మంత్రి కెటిఆర్‌ను బేగంపేట క్యాంపు కార్యాలయంలో బుధవారం కలిశారు. బేబీ వరుణిక ఈ సందర్భంగా తండ్రి ఇచ్చిన లక్ష రూపాయల చెక్కును ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వాలంటూ కెటిఆర్‌కు అందజేసింది. ఇక నుంచి తన ప్రతి పుట్టిన రోజు నాడు పది మందికి ఉపయోగ పడే పనులను చేస్తానని కెటిఆర్‌కు వెల్లడించింది. చిన్న వయసులోనే వరుణిక అలవర్చుకున్న సామాజిక స్పృహను మంత్రి కెటిఆర్ ప్రశంసించడమే కాకుండా ఆ పాపకు పుట్టిన రోజు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. అంతే కాకుండా ఒక మొక్కను కూడా ఆమెకు బహుమతిగా అందించారు.

Comments

comments