Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

అతిగా పని చేయకండి

bonded-labour_manatelanganaకొందరు తాము పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నామని, అతిగా పనిచేస్తుంటారు. శరీరానికి విశ్రాంతి లేకుండా పనిచేస్తూనే ఉంటారు. కానీ ఇలా చేయటం సరికాదని వైద్యులు అంటున్నారు. ఏపనినైనా శరీరానికి విశ్రాంతినిస్తూ చేయాలి. పనికి విరామమిచ్చి చేస్తే, ఎక్కువ పనిచేయగలుగుతాం. అలా చేస్తేనే ఆరోగ్యానికి మంచిది. అంతే కానీ ఇష్టం వచ్చినట్లు పనిచేస్తే, దాని ప్రభావం వయసు మీద పడిన తరువాత శరీరంపై కచ్చితంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మోకాళ్ళ అరుగుదల, కీళ్ళ నొప్పులు, ఎముకల్లో పటిష్టత లోపించటం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. తక్కువ వయసుకే శరీరంలో సత్తువ లోపిస్తుంది. అందుకే పరిమితికి మించి పనిచేయకూడదు.

Comments

comments