Home ఆదిలాబాద్ క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవద్దు

క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవద్దు

దీర్ఘకాలిక కేసులకు లోక్ అదాలత్ రాజమార్గం
సీనియర్ సివిల్ జడ్జి హేమంత్‌కుమార్

Untitled-1

మంచిర్యాల:క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవద్దని మంచిర్యాల సీనియర్ సివిల్ జడ్జి హేమంత్‌కుమార్ అన్నారు. శనివారం మంచిర్యాల కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన లోక్ అదాలత్‌లో ఆత్మహత్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ లోక్ అదాలత్ ముఖ్యఅతిధిగా పాల్గొని హేమంత్ కుమార్ మాట్లాడారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించేందుకు పట్టణాలలోని కళాశాలలో జరుగుతున్న చిన్న చిన్న సమస్యలతో ఆత్మహత్యలు చేసుకుంటూ వారి జీవితాలను చాలిస్తున్నారన్నారు. భార్య భర్తలు నూరేళ్ల జీవితాన్ని గడపాల్సినవారు అనుమానం అనే పెనుభూతంతో ఒకరిపై ఒకరూ కక్షసాధింపు చర్యలతో పిల్లలకు దూరమవుతున్నారని, రైతులు సైతం కాలం అనుకూలించకపోవడం. పంటలు సరిగా పండక పోవడం అప్పులు పె రగడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ఒక జీవితమే కాకుండా కుటుంబాలను రోడ్‌న పడేస్తున్నాయన్నారు. వీటన్నీటికి తొందరపాటులో తీసుకునే నిర్ణయాలే కారణమన్నారు. ఆత్మహత్య చేసుకునే వారిని గ్రహించి, కొద్దిపాటిగా వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తే ఒక జీవితాన్ని ప్రసాదించినట్లే అన్నారు. శనివారం ఉదయం ప్రారంభమైన లోక్ అదాలత్ కార్యక్రమం రాత్రి 8 గంటల వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి నసీమా సుల్తానా, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మి ప్రసాద్, ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యుటర్ రాజయ్య, బార్ అసోసియేషన్ సభ్యులు కొత్త సత్యనారాయణ, రవిందర్‌రావు, పి. నారాయణ, మల్లారెడ్డి, పులిరాజమల్లు, మొగిలి సత్యం, తిరుపతి, దుండెగణపతి,రవికుమార్ పాల్గొన్నారు.