Home తాజా వార్తలు ఎవరు ఏది తినాలో నిర్ణయించే హక్కు లేదు

ఎవరు ఏది తినాలో నిర్ణయించే హక్కు లేదు

Venkayya-Naiduవరంగల్ : గోమాంసం తిన్నారంటూ దాద్రిలో ఒక వ్యక్తిని అమానుషంగా హత్యచేసిన సంఘటన, కర్ణాటకలో కుల్బర్గీని హత్యచేసిన ఘటనల్లో కొందరు కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తున్నాయని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ శాఖల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, ఎవరు ఏ ఆహారం తినాలని నిర్ణయించే హక్కు ఎవరీకీ లేదని తేల్చిచెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాద్‌పార్టీ, కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉంటే తమను నిందించడమేమిటంటూ ప్రశ్నించారు. దేశంలో అందరికీ మత స్వేచ్ఛ ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. వరంగల్ పర్యటన సందర్భంగా ఆదివారం నగరంలో ఏర్పాటు చేసిన పార్టీ జిల్లా కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో హిందువులు, క్రిష్టియన్లు, ముస్లీంలు అన్ని మతాలకు మత స్వేచ్ఛ ఉందన్నారు. హిందుత్వం ఒక మతం కాదని, ఆదొక జీవన విధానమన్నారు.