Search
Wednesday 14 November 2018
  • :
  • :

రాత్రిపూట తినకుంటేనే మంచిది..

Food

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న సమస్య నిద్రలేమి. రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్ర తప్పనిసరి. సరైన నిద్ర పట్టకపోవడానికి రాత్రిపూట తీసుకునే ఆహారం కూడా కారణమౌతుంది. అవేంటో తెలుసుకుని వాటి జోలికి వెళ్లకపోవడమే మంచిది. సరైన నిద్రలేకుంటే అనారోగ్యం బారిన పడటం ఖాయం. కింద చెప్పిన పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల నిద్రాభంగం కలగడంతోపాటు బరువు పెరుగుతారని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చాక్‌లెట్: డార్క్ చాక్లెట్లు ఆరోగ్యానికి మంచిదనే విషయం తెలిసిందే. వీటిల్లో మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అంతేగాక కెఫీన్ కూడా ఉండటం వల్ల నిద్రరాకుండా చేస్తుంది.
అన్నం: రాత్రుళ్లు ఎక్కువ మోతాదులో అన్నం తినడం వల్ల అది కొవ్వుగా మారుతుంది. అలాంటి కొవ్వును కరిగించుకోవడం చాలా కష్టం.
చైనీస్ ఫుడ్: చైనీస్ ఫుడ్‌లో(MSG) మోనోసోడియం గ్లుటోమేరియట్ అనే ఫ్లేవర్ ఉంటుంది. కెఫీన్ చేసే పనిని ఇది చేస్తుంది. నిద్ర రాకుండా చేస్తుంది.
మసాలాతో కూడిన వంటకం: ఎండుమిర్చి మంచిదే. కానీ డోస్ ఎక్కువైతే మాత్రం ఆరోగ్యానికి హాని చేస్తుంది. ఎక్కువ మసాలాలతో చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల గుండె మంట ఎక్కువవుతుంది. దానివల్ల నిద్రాభంగం అవుతుంది.
నట్స్: బాదం, పిస్తా, వేరుశనగలాంటిని రాత్రుళ్లు తీసుకోవడం వల్ల అవి కొవ్వుగా మారతాయి. చీజ్, బటర్‌లాంటి ఎక్కువ శాతం కొవ్వు వున్న పదార్థాలు. వీటిని కూడా రాత్రి పూట తీసుకోకూడదు.
పాలు: పాలల్లో ప్రోటీన్స్, కాల్షియం శాతం అధికం. ఇవి నిద్రరాకుండా చేస్తాయి. కొంతమందికి పాలు సరిగ్గా జీర్ణం కావు.
పిజ్జా, బర్గర్: ఎక్కువ శాతం కొవ్వు ఉన్న పదార్థాలివి. ఇవి రాత్రిపూట తినడం వల్ల పొట్టపై ఒత్తిడి పెరుగుతుంది. తిన్నది జీర్ణం కావడానికి ఉదయం దాకా తీసుకుంటుంది.
రెడ్ మీట్: చికెన్, మటన్‌లాంటి మాంసాహారం తీసుకుంటే అది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. తొందరగా బరువు పెరుగుతారు.

Comments

comments